Bus Falls From Flyover Viral Video : ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డ RTC బస్సు.. ఆస్పత్రిలో 20మంది.. డ్రైవర్ నిద్రమత్తే కారణం! - గాజియాబాద్‌లో ఫ్లైఓవర్ పైనుంచి పొలంపో పడ్డ బస్సు
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2023, 9:23 PM IST
|Updated : Sep 14, 2023, 10:07 PM IST
Bus Falls From Flyover Viral Video : ఉత్తర్‌ప్రదేశ్.. గాజియాబాద్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడింది. దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది.. దిల్లీ-ఎక్స్‌ప్రెస్‌వేపై ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు హవా హవారీ రెస్టారెంట్ సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. అనంతరం అదుపు తప్పిన బస్సు.. నేరుగా రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే ఫ్లైఓవర్ పై నుంచి కింద ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించామని ఏసీపీ నరేశ్ కుమార్ వెల్లడించారు.
పొలంలో పడే ముందు బస్సు.. స్తంభాన్ని ఢీకొట్టిందని క్షతగాత్రుడు మహ్మద్ సాధిక్ తెలిపాడు. అయితే నిద్ర మత్తులో డ్రైవర్ ఉన్నాడని కొందరు ప్రయాణికులు తెలిపారు. కానీ ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు.