Bommala Koluvu Festival : 4,500 బొమ్మల కొలువు.. రామాయణం, మహాభారతం చిన్నారులకు ఈజీగా అర్థమయ్యేలా ఏర్పాటు - దసరా బొమ్మల కొలువు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 9:54 AM IST

Bommala Koluvu Festival : దసరా సందర్భంగా సుమారు 4,500 బొమ్మలను ప్రదర్శించారు కర్ణాటకకు చెందిన ఓ మహిళ. దావణగెరెలోని వినోభానగర్​కు చెందిన చంద్రిక.. గత 22 ఏళ్లుగా బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆమెను 'దసరా బొమ్మల కొలువు చంద్రిక'గా పిలుస్తున్నారు స్థానికులు. పదిరోజుల పాటు సాగే ఈ బొమ్మల కొలువును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు.

ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసేందుకు దాదాపు నెల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు చంద్రిక. పేపర్​, చెక్క, ఇత్తడి, క్లే, పత్తి, వస్త్రం, వైర్లతో అందంగా రూపొందిస్తారు. బొమ్మల కొలువులో చివరి రోజున ఊయలలో వేసి పూజలు చేసి తీసివేస్తారు. బొమ్మల పైన ఆసక్తి కలిగిన చంద్రిక.. ఎక్కడికి వెళ్లినా కొనుగోలు చేసి తీసుకువస్తారు. కొండపల్లి, మధురై లాంటి ప్రాంతాల నుంచి ఈ బొమ్మలను సేకరించారు. దసరా సమయంలో వీటన్నింటిని ఒకే దగ్గర పెట్టి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.

వీటిలో దశవతారాలు, అనంత పద్మనాభ స్వామి, బకాసుర బొమ్మలతో రైతు జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. మహాభారతం, రామాయణంలోని పాత్రలను సైతం ఈ బొమ్మల కొలువులో ఉంచారు. "గత 22 ఏళ్లుగా నా ఇంట్లో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నాను. చిన్నారులకు మన పురాణగాథలు సులభంగా అర్థమయ్యేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాను." అని చంద్రిక తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.