BJP Fired on MP Viayasai Reddy దిల్లీ మద్యం కుంభకోణంలో ఆ ఫోన్లు పగిలాయి.. ఏపీ మద్యం కుంభకోణంలో ఎవరి ఫోన్లు పగులుతాయ్! - Delhi Liquor Scam
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 9:22 PM IST
Lanka Dinkar Fired on YSRCP MP Viayasai Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు మండిపడ్తున్నారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి.. కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో, దసపల్ల భూముల్లో, రామయపట్నం పోర్టులో విజయసాయిరెడ్డి కుటుంబసభ్యుల హస్తముందని విమర్శిస్తున్నారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు.. శరత్ చంద్ర రెడ్డి పాత్రేమిటనే అంశాన్ని బయట పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు. విశాఖలో దసపల్ల భూములను విజయసాయి రెడ్డి కుమార్తె పేరిట కాజేశారని ఆయన ఆరోపించారు. రామయపట్నం పోర్టులో విజయసాయిరెడ్డి కుటుంబం పాత్ర, ప్రభుత్వ జీవో జారీ వెనుక కారణాలు వెలుగులోకి రావాలన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో సమాచారం బయటపడతాయని.. పగిలిపోయిన ఫోన్లు ఎవరివి అని ప్రశ్నించారు. ఆ వివరాలు విజయసాయి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దిల్లీ మద్యం కుంభకోణంలో ఆ ఫోన్లు పగిలిపోతే.. ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణంలో ఎవరి ఫోన్లు పగులుతాయో చుద్దామని అన్నారు. నాసిరకం మద్యం తయారీలో విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబమే ఉందని ఆయన ఆరోపించారు.