BJP Dharna for Roads in Markapuram: రోడ్డు బాగు చేయాలంటూ.. మార్కాపురంలో బీజేపీ ధర్నా
🎬 Watch Now: Feature Video
BJP Dharna for Roads in Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురంలో రహదారులు మరమ్మతులు చేయాలని కోరుతూ భాజాపా నాయకులు ధర్నా నిర్వహించారు. ఒంగోలు రోడ్డులోని రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్లే రహదారి మొత్తం గుంతలమయంగా మారిందని వారు వాపోయారు. తమ పాంత్రంలో ఎటు చూసినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ పీవీ కృష్ణారావు విమర్శించారు. ప్రతి రోజు ఈ రహదారి వెంట చాలా మంది ప్రజా ప్రతినిధులు ప్రయాణిస్తూ ఉంటారని బీజేపీ నాయకులు తెలిపారు. అయినా ఈ రోడ్డును బాగు చేద్దామనే అలోచన కూడా వారికి రాకపోవడం శోచనీయం అని బీజేపీ నాయకులు విమర్శలు కురిపించారు. ఈ రహదారిలో వర్షం పడితే.. వాన నీరు చాలా రోజులు అలా రోడ్డుపైనే నిలిచి ఉంటాయని వారు అన్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని బీజేపీ నాయకులు తెలిపారు.