Bike Truck Collision Viral Video : బైక్​ను ఢీకొన్న ట్రక్​.. ట్రాఫిక్​ పోలీస్​ అలర్ట్.. లక్కీగా ముగ్గురూ.. - ఉత్తరాఖండ్​ రోడ్డు ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 9:24 PM IST

Bike Truck Collision Viral Video : రోడ్డు మీద వెళ్తున్న బైక్​ను ఓ ట్రక్కు ఢీకొన్న సమయంలో.. ట్రాఫిక్​ పోలీస్​ అప్రమత్తత వల్ల త్రుటిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్​ రాజధాని దెహ్రాదూన్​లో ఈ ఘటన జరిగింది. త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

అసలేం జరిగిందంటే?
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దెహ్రాదూన్​లోని రిస్పానా వంతెన వద్ద ఏర్పడిన ట్రాఫిక్​ను.. బుధవారం ఉదయం పోలీసులు మళ్లిస్తున్నారు. అదే సమయంలో పాత బైపాస్​ చౌక్​ నుంచి రిస్పానా వంతెన వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఘటనా సమయంలో బైక్​పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అందులో ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ట్రక్కు ఢీకొన్న వెంటనే ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు.

అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్​ పోలీస్​.. ట్రక్కు ఢీకొట్టడాన్ని గమనించారు. అప్రమత్తమై వెంటనే ట్రక్కు ఆపాలని సిగ్నల్​ ఇచ్చారు. కాస్త ట్రక్కును వెనక్కి పోనిచ్చారు. దీంతో ముగ్గురు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. అయితే నిమిషం ఆలస్యమైనా ముగ్గురు పైనుంచి ట్రక్కు వెళ్లపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ నియమాలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.