అతిపెద్ద మెడికల్ కాన్ఫెరెన్స్- 8వేల మంది శస్త్ర చికిత్స నిపుణులు హాజరు
🎬 Watch Now: Feature Video
Biggest Medical Conference Is Held In Visakhaptnam: రాష్ట్రంలో అతిపెద్ద మెడికల్ కాన్ఫెరెన్స్‌కు విశాఖపట్నం సిద్ధమైంది. 'ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జాతీయ సదస్సు విశాఖ రుషికొండలోని ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, సార్క్ దేశాల నుంచి సుమారు 8వేల మంది శస్త్ర చికిత్స నిపుణులు పాల్గొంటున్నారని కాన్ఫెరెన్స్ ఆర్గనైజింగ్ ఛైర్మన్ డా. జి. శాంతారావు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతీయ సదస్సులో సర్జరీకి సంబంధించిన వివిధ అంశాలపై మెడికల్ సెషన్స్ ఉంటాయని శాంతారావు తెలిపారు.
సుమారు 2500 మంది యంగ్ సర్జన్లు, పోస్టర్స్, ఫ్రీసైంటిఫిక్ పేపర్‌ను ప్రదర్శించనున్నారని తెలిపారు. ప్రముఖ వైద్యులు ఆపరేటివ్ సర్జరీస్ వర్చువల్ లైవ్ వర్క్ షాప్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌లు హాజరవుతున్నారని వెల్లడించారు. సదస్సులో భాగంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పి.రఘురాంకు , పద్మశ్రీ డాక్టర్.పట్టాభిరామయ్యలకు జీవితకాల సాఫల్య పురస్కారాలను ప్రధానం చేస్తామన్నారు.