Bengaluru IT Employees Protest ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు ! స్కిల్ డెవలప్​మెంట్ కేంద్రాలు లేకపోతే అవార్డులను ఎలా తీసుకున్నారు: బెంగళూరు ఐటీ ఉద్యోగులు - Chandrababu Case Updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 8:30 PM IST

Updated : Sep 24, 2023, 9:31 PM IST

Bengaluru IT Employees Protest Against Chandrababu Arrest: రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ శిబిరాలు లేనప్పుడు సదరు కార్పొరేషన్​కు కేంద్ర ప్రభుత్వం అందించిన ఉత్తమ అవార్డును ఎలా అందుకున్నారంటూ ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి బెంగళూరు ఐటీ ఉద్యోగులు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ గత 13 రోజులుగా నియోజకవర్గ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. 

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా నియోజకవర్గ బెంగళూరు ఐటీ ఫోరం నేతలు (ఉద్యోగులు) మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ టీడీపీ ఐటీ ఫోరం అధ్యక్షుడు రావెళ్ల లోకేశ్, నియోజకవర్గ ఐటీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో పలువురు ఐటీ ఉద్యోగులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఐటీ రంగంలో చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలను ఆదర్శంగా తీసుకుని తమ ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డామని, స్కిల్ డెవలప్మెంట్ శిబిరాల ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన లక్షలాదిమంది యువతీ యువకులు అన్ని రంగాల్లో ఉద్యోగాలు సాధించి ఉపాధి పొందుతున్నారని అన్నారు. లక్షలాది కుటుంబాల్లో ఐటీ ఉద్యోగులు ఉన్నారని వారి ఇళ్లకు వెళ్లి మీరు పొందుతున్న ఉపాధి నిజమేనా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నించగలరా అంటూ సవాల్ విసిరారు. అవాస్తవాలను జొప్పించి,అక్రమకేసులు పెట్టారని ఉద్యోగులు మండిపడ్డారు. 

13 రోజులుగా నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న దీక్షలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని విభాగాల్లో నాయకులు కార్యకర్తలు హాజరై మద్దతు తెలపడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ నేత చిట్టిబాబు నాయుడు తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ థామస్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరానికి బడుగు బలహీన, కర్షక, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరై మద్దతు ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని భీమా వ్యక్తం చేశారు. చౌకబారు చేష్టలతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను బెదిరించలేరని, ఇటువంటి చర్యలు ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. 

Last Updated : Sep 24, 2023, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.