Avinash Reddy mother health condition: అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే.. - Avinash Reddy mother is ill
🎬 Watch Now: Feature Video
Avinash Reddy mother health condition: వైయస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ ఎంక్వైరీకి హాజరు కావలసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూల్ లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో కడప నుంచి హైదరాబాద్ లో చికిత్స చేయించేందుకు అంబులెన్స్‌లో కడప నుంచి బయలుదేరగా విషయం తెలుసుకున్న వైయస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎంక్వయిరీకి వెళ్లకుండా వారి తల్లిని చూసేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తాడిపత్రిలో అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు హితేశ్ రెడ్డి తెలిపారు. ఛాతి నొప్పి రావడంతో ఈసీజీ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. బీపీ తక్కువగా ఉందని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అవినాశ్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తన తల్లి దగ్గరే ఉండి ఆరోగ్య పరిస్థితిని చూసుకుంటునట్లు చెప్పారు.