Ashadamasa sare Program: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన ఆషాఢ సారె కార్యక్రమం.. వచ్చే నెల 17వరకు
Ashada Sare Program in Vijayawada: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి వచ్చెే నెల 17వ తేదీ వరకు ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం కొనసాగనుంది. స్వర్ణ ఆభరణాలతో పసిడి కాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను భక్తులు ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, వస్త్రాలు, చలివిడి, పండ్లు ఇతర సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి కానుకగా సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభం రోజున ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులతో సహా కనకదుర్గ నగర్ నుంచి ఇంద్రకీలాద్రి చేరుకుని సారె సమర్పించారు.
దుర్గామల్లేశ్వర స్వామి మహా మండపంలో సారె సమర్పించేవారు ఆరో అంతస్తులో ముందుగా సమాచారం ఇస్తే వారికి దర్శనంతో పాటు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని ఆలయ కమిటీ పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సారె సమర్పణకు రానునున్నారని ఆలయ అధికారులు ముందుగా చర్యలు తీసుకున్నారు.