Balakotaiah on Pawan Comments: మహిళల అదృశ్యం వెనుక నిజాలు నిగ్గు తేల్చాలి: బాలకోటయ్య - Pawan Kalyan Comments
🎬 Watch Now: Feature Video
Balakotaiah Response on Pawan Kalyan Comments: రాష్ట్రంలో వేల సంఖ్యలో మహిళలు అదృశ్యం అవుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని.. ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కోరారు. మహిళలపై రైల్వే స్టేషన్లలో, ఆసుపత్రుల్లో అత్యాచారాలు జరిగితే స్పందించని మహిళా కమిషన్.. మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ల పాత్ర ఉందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి నోటీసులు ఇవ్వడమేంటని బాలకోటయ్య ప్రశ్నించారు. స్పందించాల్సిన హోం మంత్రి.. రక్షణ చేపట్టాల్సిన డీజీపీలు ఏం చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ చెప్పిన దానిలో నిజనిజాలు విచారించాల్సింది పోయి.. ఆయనపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని.. సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ స్పందన ఏంటని ప్రశ్నించారు. వ్యక్తిగత సమాచారంతో వాలంటీర్లకు ఏం పని అని నిలదీశారు. తక్షణమే డీజీపీ,హోంమంత్రి.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని.. మహిళల అదృశ్యం వెనుక నిజనిజాలు నిగ్గు తేల్చాలన్నారు.