Nagababu on CM: 'ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదవిలోంచి దింపితే తప్పేంటి బ్రదర్': నాగబాబు - cm jagan news
🎬 Watch Now: Feature Video
Janasena general secretary Nagababu sensational comments on CM Jagan: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రంలో నూటికి ఎనభై శాతం మంది ప్రజలు.. ఈ ఉప్మా ముఖ్యమంత్రి మాకు వద్దు' అంటున్నారంటూ ముఖ్యమంత్రి జగన్‌ని నాగబాబు 'ఉప్మా'తో సంభోదించారు. ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమైతే తప్పేంటి బ్రదర్..? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రానికి విముక్తి కలగాలం.. పోరాటం తప్పదు.. గతకొన్ని రోజులుగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు 'కథాకళి పేరిట' వీడియోలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కథాకళిలో ఓ ఉప్మా కథను చెప్తూ.. రాష్ట్రంలో విపక్షాల పొత్తులపై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించటంపై నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. ఉప్మా ముఖ్యమంత్రిని దించేందుకు మిగతా వారు ఏకమైతే తప్పేంటన్న నాగబాబు.. వైసీపీ రాక్షస పాలన నుండి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి కలగాలంటే.. అన్ని పార్టీల వారు ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసి పోరాటం చేయక తప్పదని ఆయన అన్నారు.
నాగబాబు ఉప్మా కథ.. నాగబాబు మాట్లాడుతూ..''ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్‌లో వంద మంది విద్యార్థులున్నారు. వారికి ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ కింద ఉప్మా పెట్టేవారు. ఆ వంద మందిలో ఇరవై శాతం మంది ఆ ఉప్మాను ఇష్టంగానే తింటారు. మిగతా ఆ ఎనభై శాతం మంది.. డైలీ మాకు ఈ ఉప్మా కర్మేంటి రా బాబు అని యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంది. మేము ఓటింగ్ పెడతాం.. అందులో ఎక్కువ మంది ఏది కోరుకుంటారో అదే పెడతామన్నారు. ఓటింగ్ జరిగింది. అందులో 20శాతం ఉప్మాకు ఓట్లు పడ్డాయి. మిగతా 80శాతం వేరే వేరే వాటికి ఓట్లు పడ్డాయి. అయినా, ఆ హాస్టల్లో మళ్లీ అదే ఉప్మాను పెట్టడం మొదలుపెట్టారు. అలాగే, రాష్ట్రంలో కూడా నూటికి ఎనభై శాతం మంది ఈ ఉప్మా ముఖ్యమంత్రి మాకొద్దు అంటున్నారు. వద్దు అనుకుంటున్నా ప్రజల కోసం వేరువేరుగా పోటీ చేసే రాజకీయా పార్టీలు కలిసి.. మళ్లీ ఈ ఉప్మా ముఖ్యమంత్రిని ప్రజలపై రుద్దకుండా.. ప్రజల కోసం అందరం కలిసి పోటీ చేసి.. ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదవిలోంచి దింపితే తప్పేంటి బ్రదర్'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.