ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో యువకుల ఘర్షణ - కబడ్డీ క్రీడాకారుల బాహాబాహీ - ఇరుజట్ల మధ్య ఘర్షణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 4:46 PM IST
Adudham Andhra Competition Clash Controversy in Two Teams: రాష్ట్రంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు చివరకు యువకుల మధ్య వివాదానికి కారణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి పోటీలు మూడు రోజులపాటు నిర్వహిస్తుండగా రెండవ రోజు గురువారం కబడ్డీ పోటీల్లో ఇరుజట్ల క్రీడాకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
నరసన్నపేట మండలంలో కరగాం, రెడ్డికిపేట అనే ఇరు జట్ల మధ్య స్వల్ప వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. పోలీసులు వచ్చి సర్దుబాటు చేసేలోపు అక్కడ పరిస్థితి అంతా ఉద్ధృతంగా మారిందని తెలిపారు. ఇరువర్గాల క్రీడాకారులు బాహాబాహీకి దిగడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. వెంటనే పరిస్థితి గమనించి ఇరుజట్లను మండల స్థాయి అధికారులు, పోలీసులు అక్కడి నుంచి పంపించారు. దీంతో పరిస్థితి అంతా సద్దుమణిగిందని పోలీసులు తెలిపారు.