అడవి మధ్యలో సీక్రెట్ రన్‌వే- డ్రగ్స్ రవాణా కోసం... - బొలివియా బ్రెజిల్ సరిహద్దు
🎬 Watch Now: Feature Video
బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అడవి నడిబొడ్డున డ్రగ్ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న రహస్య రన్‌వేను అధికారులు గుర్తించారు. బొలీవియా యాంటీ-నార్కొటిక్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించి బాంబులతో దీన్ని నిర్వీర్యం చేసింది. బ్రెజిల్‌కు చెందిన హెలికాప్టర్‌ను అధికారులు సీజ్ చేశారు. పైలట్‌కు బ్రెజిల్లో అత్యంత ప్రమాదకర డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను మాజీ పోలీస్ అని చెప్పారు. ఒక్కో ట్రిప్పుకు 300-450 కిలోల డ్రగ్స్‌తో నెలకు ఆరుసార్లు తాను విమానం నడిపేవాడినని ఆ పైలట్ విచారణలో అంగీకరించాడు. ఏడాది కాలంగా ఈ రహస్య రన్‌వే నుంచి స్మగ్లర్లు డ్రగ్స్ సరఫరా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.