'దసరా' ప్రమోషన్స్.. నాగ్‌పుర్‌లో ట్రాక్టర్‌పై నాని రయ్ రయ్.. - ట్రాక్టర్ పై నాని షికార్లు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18067508-thumbnail-16x9-nani.jpg)
క్లాప్ అసిస్టెంట్ నుంచి నేచురల్ స్టార్ గా ఎదగడానికి తన కోసం దర్శకులు రాసిన మంచి కథలేనని యువ కథానాయకుడు నాని అన్నారు. ఆ కథలకు తగిన విధంగా సహజత్వానికి దగ్గరగా తన ప్రవర్తన ఉండటం వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ నేచురల్ స్టార్‌గా గుర్తించిందని పేర్కొన్నారు. తన కొత్త చిత్రం 'దసరా' ప్రచారంలో భాగంగా నాగ్ పుర్ వెళ్లిన నాని.... అక్కడి సామాన్య ప్రజలు, దుకాణాదారులు, ఛాయ్ వాలాలతో ముచ్చటిస్తూ వారితో గడిపారు. అక్కడి వారందరితో కలిసి సందడి చేశారు. ఓ ట్రాక్టర్ పై రయ్ రయ్ అంటూ షికార్లు కొట్టారు. అక్కడి థియేటర్ లో ప్రేక్షకులకు కలుసుకున్నారు. దసరా చిత్ర విశేషాలతో పాటు ఆ చిత్రం కోసం తాను పడిన శ్రమను వివరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా, మార్చి 30న దసరా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించింది.