తమ్ముడితో వాగ్వాదం- 25 అంతస్తుల భవనంపై అక్క సాహసం - తమిళనాడు 25 అంతస్థుల భవనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2020, 9:26 AM IST

Updated : Aug 12, 2020, 11:50 AM IST

ఓ బాలిక అత్యంత సాహసంతో 25 అంతస్తుల భవనంపై నడుస్తూ వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు పాత మహాబలిపురం రోడ్​లో ఉన్న 'హీరనందని మెడొస్' 23వ అంతస్తులో నడుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ బాలిక. భవనానికి ఎదురుగా ఉన్న అపార్ట్​మెంట్ వాసులు ఈ దృశ్యాలను బంధించారు. ఈ ఘటనపై కేలంబక్కం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను గుర్తించిన పోలీసులు.. తను చెప్పిన సమాధానానికి అవాక్కయ్యారు. సోదరుడితో జరిగిన వాగ్వాదం కారణంగానే తన ధైర్యసాహసాన్ని నిరూపించుకునేందుకు ఈ పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 15 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. తల్లితండ్రుల హామీ మేరకు బాలికను పోలీసులు విడిచిపెట్టారు.
Last Updated : Aug 12, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.