Lakhimpur Kheri incident: రైతులపైకి కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన దృశ్యాలు! - లఖింపుర్ ఖేరి హింస న్యూస్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri incident) రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి వాహనం దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలేనని తెలుస్తోంది. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకు రావడం వీడియోలో కనిపిస్తోంది. మిర్జాపుర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత లలితేశ్ పాటి త్రిపాఠి ఈ వీడియోను ట్వీట్ చేశారు. లఖింపుర్ ఖేరి హింసాకాండకు ఇదే రుజువు అని చెప్పారు.
Last Updated : Oct 5, 2021, 9:51 AM IST