ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు కారణం ఇదే - రాజస్థాన్‌లో డీజిల్‌తో నిప్పంటించుకున్న యువకుడు
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లో ఓ గొడవ కారణంగా మనస్తాపానికి గురైన యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భిల్వారా జిల్లాలోని ఫూలియకలన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గీతా దేవి కుమారుడు చోటూ కుమావత్‌తో కొందరు గొడవకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన చోటూ రోడ్డుపైకి వచ్చి డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే తల్లి గీతాదేవి అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అనంతరం శరీరంమంతా కాలిపోయి చోటు కింద పడ్డాడు. ఘటనా స్థలంలో గుమిగూడిన స్థానికులు చోటూను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST