తుపాకులతో ఎన్నికల ప్రచారం.. జనం హడల్​.. వీడియో వైరల్​ - ఝార్ఖండ్​ జిల్లా పరిషత్​ ఎన్నికలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2022, 5:58 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

తుపాకులు చేతపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంఘటన ఝార్ఖండ్​, సాహిబ్​గంజ్​ జిల్లాలోని ముఫస్సిల్​ స్టేషన్​ పరిధిలో కొద్ది రోజుల క్రితం జరిగింది. జిల్లా పరిషత్​ ఎన్నికల్లో సునీల్​ యాదవ్​ అనే అభ్యర్థి ఈ ప్రచారం నిర్వహించారు. తుపాకులతో గ్రామాల్లో తిరుగుతున్న వీడియోను భాజపా నేత బాబులాల్​ మరాండీ ట్విట్టర్​లో పోస్ట్​ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్​గా మారాయి. దీంతో రాజకీయంగా దుమారం చెలరేగింది. సాహిబ్​గంజ్​ జిల్లా ఎన్నికలు ఈ స్థాయిలో జరుగుతున్నాయని.. ఇలాంటి మాఫియాగిరికి ముగింపు పలకాలని పిలిపునిచ్చారు బాబులాల్​. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అనురంజన్​ కిస్పోట్టా చర్యలకు ఆదేశించారు. వెంటనే సునీల్​ యాదవ్​ అనుచరుల నుంచి ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.