ట్రాక్టర్‌ను లాగేసిన వరద, బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి, స్థానికుల సాయంతో - కర్ణాటక తమకూరు న్యూస్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక తుమకూరులో శనివారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి వరదలు సంభవించాయి. దీంతో కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చంద్రగిరి గ్రామ సమీపంలో ఓ కాలువలో ఆదివారం ఉదయం ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిని స్థానికులు తాడుతో ఒడ్డుకు లాగి కాపాడారు. మరోవైపు కొరటగెరె- వడ్డగెరె రహదారిలో మలప్పనహళ్లి గ్రామంలో వరదల్లో బైక్ కొట్టుకుపోతుండగా వాహనం మీద ఉన్న యువకుడిని కాపాడారు స్థానికులు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST