ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి - uttarakhand rains
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడడం వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. చమోలీ జిల్లాలోని పైన్గర్ గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారి కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో మూడు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 12 ఏళ్ల బాలిక గాయాలతో బయటపడింది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST