గర్భిణీని మంచంపై మోసుకెళ్లి ఆసుపత్రి తరలించిన సీఆర్ఫీఎఫ్ జవాన్లు - ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్ జవాన్లు
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్ఫీఎఫ్ జవాన్లు గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని ఆసుపత్రి తరలించారు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని గ్రామంలో ప్రసవవేదన పడుతున్న మహిళను మంచంపై పడుకోబెట్టి వాహనం వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
శనివారం ఉదయం సుక్మా జిల్లాలో ఆ సంఘటన జరిగింది. నక్సల్ ప్రభావిత గ్రామమైన పోట్కపల్లిలో వెట్టి మాయ అనే మహిళ పురిటి నొప్పులతో బాధ పడుతుంది. విషయం, అదే గ్రామ పరిసరాల్లో క్యాంపు ఏర్పాటు చేసుకుని ఉన్న సీఆర్పిఎఫ్ జవాన్లకు తెలిసింది. వెంటనే కొందరు జవాన్లు, తమ మెడికల్ టీంతో మహిళ ఇంటికి చేరుకున్నారు. మొదటి ఆ మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఓ సివిల్ వాహనంలో ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జవాన్ల సాయానికి కృతజ్ఞతలు తెలిపారు వెట్టి మాయ కుటుంబ సభ్యులు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST