యువకుడిపై నుంచి రైలు వెళ్లినా లక్కీగా - యువకుడిపై నుంచి వెళ్లిన రైలు
🎬 Watch Now: Feature Video
బిహార్ భాగల్పుర్కు చెందిన ఓ వ్యక్తి పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన కహల్గావ్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఓ వ్యక్తి పట్టాలను దాటేందుకు గూడ్స్ ట్రైన్ కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో అప్రమత్తమైన యువకుడు పట్టాలపై అలానే పడుకున్నాడు. రైలు పూర్తిగా వెళ్లేంతవరకూ కదలకుండా పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత లేచి రావడం వల్ల ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST