ఏనుగు దెబ్బకు అడవిలో 8 కిలోమీటర్లు రివర్స్ గేర్లో బస్సు ప్రయాణం - కేరళ త్రిస్సూర్ బస్సు న్యూస్
🎬 Watch Now: Feature Video
కేరళ త్రిస్సూర్ జిల్లాలోని అటవీ మార్గంలో ఓ బస్సు డ్రైవర్ 8 కిలోమీటర్లు మేర బస్సును రివర్స్ గేర్లో నడిపాడు. మంగళవారం చలకుడిలోని వాల్‌పరై అటవీ మార్గంలో ఓ ఏనుగు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సును వెంబడించింది. ఏనుగు బారి నుంచి ప్రయాణికులను కాపాడేందుకు డ్రైవర్ బస్సును రివర్స్ గేర్లో నడిపాడు. కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని చెప్పాడు డ్రైవర్. ఇది మరిచిపోలేని అనుభవమని అన్నాడు. అటవీ మార్గం అయినందున వేరే అవకాశం లేక అలా చేసినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST