అక్రమంగా తరలిస్తున్న రూ.5 కోట్ల డ్రగ్స్‌ను పట్టించిన శునకం - దిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ కలకలం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17266408-thumbnail-3x2-dfkf.jpg)
ఓ శునకం సహాయంతో ఏకంగా రూ. 5.35 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.
ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని విమానాశ్రయంలో జరిగింది. ఉగాండకు చెందిన అడిస్ అబాబా అనే మహిళ బ్యాగ్‌లో 1542 గ్రాముల మెథాక్వలోన్, 644 గ్రాముల హెరాయిన్ లభ్యమైంది. అనంతరం కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు.
దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి విదేశీ కరెన్సీని పట్టుకున్నారు సీఐఎస్ఎఫ్ అధికారులు. అతడి ట్రాలీ బ్యాగ్‌లో అక్రమంగా నగదు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న విదేశీ కరెన్సీని సౌదీ రియాల్‌గా గుర్తించారు అధికారులు. దీని విలువ దాదాపు రూ.16 లక్షలు వరకు ఉంటుందని తెలిపారు. అతడు భారతదేశానికి చెందిన షేక్ పప్పు ఖాన్‌గా గుర్తించారు. దిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న సమయంలో అనుమానం రావడం వల్ల అతడిని తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST