చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల.. తల్లి వానరం ఏం చేసిందంటే? - కోతి వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
దాహం తీర్చుకునేందుకు ఓ కోతి పిల్ల ప్రయత్నం దాని ప్రాణాల మీదకు తెచ్చింది. రాగి చెంబులో తల ఇరుక్కుపోయి విలవిల్లాడింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తరీ జిల్లా కేంద్రంలో జరిగింది. నగరంలోని శివాలయం వద్ద ఓ కోతి నీళ్లు తాగేందుకు ప్రయత్నించగా తల రాగి చెంబులో ఇరుక్కుపోయింది. దానిని గమనించిన తల్లి వానరం తన బిడ్డను తీసుకుని ఓ చెట్టిపైకి వెళ్లింది. చెంబును తొలగించే ప్రయత్నం చేసింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కానీ, ఎవరీ పట్టించుకోకపోవటం వల్ల రెండు రోజుల పాటు చెంబుతోనే తిరిగింది కోతి. అదృష్టవశాత్తు రెండు రోజుల తర్వాత చెంబు తొలగిపోయి ప్రాణాలతో బయటపడింది. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ నర్మదాపురంలో వెలుగు చూసింది. ఓ పిల్ల పాలు తాగుతుండగా దాని తల స్టీల్ బాక్స్‌లో ఇరుక్కుపోయింది. యజమాని గమనించి తొలగించటంతో ఊపిరిపీల్చుకుంది. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST