పిల్లలపై దాడికి యత్నించిన పులి.. తరిమికొట్టిన తల్లి ఎలుగుబంటి
పులితో పోరాడి తన రెండు పిల్లలను కాపాడుకుంది ఓ ఎలుగుబంటి. కర్ణాటక మైసూరులోని నాగర్హోల్ నేషనల్ పార్క్లో ఈ సంఘటన జరిగింది. ఎలుగుబంటి పిల్లలపై ఓ పులి దాడికి యత్నించింది. గమనించిన తల్లి ఎలుగుబంటి పులిని తరిమికొట్టింది. ఈ దృశ్యాల్ని ఆ పార్క్లో సఫారీకి వచ్చిన టూరిస్టులు తమ మొబైల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 6, 2023, 4:07 PM IST