ETV Bharat / sukhibhava

చిన్న పిల్లల్లో మలబద్ధకం సమస్యా? ఈ ఇంటి చిట్కాలతో చెక్​ పెట్టండి! - చిన్న పిల్లల్లో మల బద్ధకానికి కారణం ఏమిటి

Treatment For Constipation In Children In Telugu : కొంత మంది చిన్న పిల్లలు మల బద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్లు ఈ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పుకోలేరు. అందుకే పిల్లలు మలం సరిగ్గా వెళ్లకపోయినా, వెళ్లిన సమయంలో ఇబ్బంది పడుతున్నా.. దానిని మలబద్ధకంగా గుర్తించాలి. మరి మీ పిల్లలు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ మలబద్ధకం సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies to relieve constipation naturally
Treatment for Constipation in Children
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 8:04 AM IST

Treatment For Constipation In Children : చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య మలబద్ధకం. డబ్బా పాలు, ఆవు/ గేదె పాలు తాగే పిల్లల్లో ఈ సమస్య తలెత్తవచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన నీరు, పోషకాలు అందని పసివాళ్లలోనూ ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది.

మల విసర్జన చేసేటప్పుడు ఏడుస్తున్నారా?
మల బద్ధకం ఉన్న పిల్లలు మల విసర్జన సరిగ్గా చేయలేకపోవడం, మల విసర్జన సమయంలో ఏడవడం లాంటివి చేస్తారు. తల్లిదండ్రులు ఈ సమస్యను వెంటనే గుర్తించకపోతే పిల్లల కడుపు గట్టిగా మారి నీరసించిపోతారు. కనుక పిల్లలు మల, మూత్రాల విసర్జన సరిగ్గా చేస్తుందీ, లేనిది తల్లదండ్రులు క్రమం తప్పకుండా గమనించాలి. తల్లి పాలు కాకుండా బర్రె పాలు, డబ్బా పాలు, ప్యాకెట్‌ పాలు, పౌడర్‌ పాలు తాగే పిల్లల్లో.. అవి అరగకపోవడం వల్ల మల బద్ధకం అనే సమస్య ఏర్పడుతుంది.

ఈ మలబద్ధకానికి తక్షణ పరిష్కారం ఏమిటంటే.. పిల్లలకు పడుతున్న పాలలో కాసిన్ని నీళ్లు కలిపితే పిల్లలు సులువుగా వాటిని అరిగించుకోగలరు. ఒక వేళ డబ్బా పాలు, పౌడర్‌ పాలు తాగేవారిలో మలబద్ధకం ఉంటే.. వెంటనే వాటిని ఆపించేయాలి. తల్లిపాలను అలవాటు చేయాలి. అలా వీలుకాకపోతే.. డాక్టర్ల సలహాతో మంచి కంపెనీ పాలను, పౌడర్లను వాడుకోవాలి. ఇవన్నీ చేసినా పిల్లల్లో మల బద్దకం సమస్య తగ్గలేదంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉందంటున్నారు నిపుణులు.

చిన్న చిట్కాలతో ఎంతో మేలు
పిల్లల్లో మలబద్ధకం తగ్గించడానికి ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్షను బాగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టి, మరునాడు ఆ నీళ్లలోనే వాటిని బాగా పిసికి పిల్లలతో తాగించాలి. ఇలా చేయడం వల్ల విరోచనం సాఫీగా అవుతుంది. అంతేకాకుండా పిల్లల్లోని ఐరన్‌ లోపం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పిల్లల్లో మల బద్ధకం ఉంటే గతంలో ఆముదం పట్టేవారు. ప్రస్తుతం చాలా మంది ఆముదం పెట్టడం మానేశారు. కానీ, నిజానికి ఆముదం పట్టడం వల్ల పిల్లల కడుపు శుభ్రమవుతుంది.

సరిగా తింటున్నారా? లేదా?
ఇక రెండు, మూడేళ్ల పిల్లలకు మలబద్ధకం సమస్య ఉంటే.. ఆ పిల్లలు అన్నీ సరిగ్గా తింటున్నారా? లేదా? గమనించాలి. సరిపడా మంచినీళ్లు తాగుతున్నారా? లేదా? చూడాలి. ఒకవేళ ఆకుకూరలు, కూరగాయలు తినకపోతే.. చిన్నతనం నుంచే వాటిని తినే అలవాటు చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగించాలి. ఎందుకంటే.. సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. మలబద్ధకం వల్ల కడుపు లోపల గట్టిపడిపోవడం.. మల విసర్జన సమయంలో నొప్పి రావడం వల్ల పిల్లలు రెండు, మూడు రోజులకు ఒకసారి మల విసర్జన చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు గుర్తించాలి.

ఇంటి చిట్కాలతో ఆరోగ్యం
పిల్లల్లో మల బద్ధకం తగ్గించడంలో ఎండు ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని ఎండు ఖర్జూరాలను శుభ్రంగా కడిగి రాత్రిపూట గోరు వెచ్చని నీళ్లలో నానబెట్టాలి. రాత్రంతా నీళ్లలో నానిన ఎండు ఖర్జూరాలను బాగా పిసికి ఉదయం తాగించాలి. ఇలా చేయడం వల్ల విరోచనం సాఫీగా అవుతుంది. ఎండు ఖర్జూరాలు కాని, ఎండు ద్రాక్షగాని మందు కాదు. చేదుగా కూడా ఉండదు. రెండూ తీపిగా ఉంటాయి కనుక పిల్లలు కూడా అల్లరి చేయకుండా తాగేస్తారు. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య తీరడంతోపాటు, పిల్లలకు అదనపు శక్తినిచ్చే కాల్షియం, ఐరన్‌ లభిస్తాయి.

చిన్న పిల్లల్లో మలబద్ధకం - నివారణ మార్గాలు!

పడక గదిని నిశ్శబ్ధం ఆవహిస్తోందా? - ఇవి ట్రై చేస్తే మీకు తిరుగుండదు!

అంగస్తంభన సమస్య వేధిస్తోందా? ఈ ఆహార పదార్థాలతో చెక్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.