ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా? - uses of drinking tomato juice
Tomato Juice Benefits : టమాటా అంటే.. కర్రీ వండడానికి మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ.. దాన్ని జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు! అలా నిత్యం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
![ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా? Tomato Juice Benefits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-12-2023/1200-675-20237141-thumbnail-16x9-benefits-of.jpg?imwidth=3840)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Dec 11, 2023, 11:45 AM IST
Tomato Juice Benefits : టమాటా లేకపోతే రోజు గడవని వారు ఎంతో మంది ఉంటారు. మూడు పూటల్లో ఏదో ఒక పూటలో తప్పకుండా టమాటా ముక్కను టేస్ట్ చేస్తారు. అయితే.. టమాటాను జ్యూస్ చేసుకొని తాగడం మాత్రం చాలా మందికి తెలియదు. ఉదయాన్నే పరగడపున టమాటా రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. నిత్యం ఒక గ్లాసు టామాటా రసం తాగడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి ? టమాటా జ్యూస్‌లో ఉన్న పోషకాలేంటి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Tomato Juice Benefits In Telugu : టమోటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు :
పరగడపున :
టమాటాలను జ్యూస్ చేసుకుని ఉదయాన్నే పరగడపున తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. టమాటా రసం తాగడం వల్ల రోజంతా శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయని అంటున్నారు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర విటమిన్‌లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
జీర్ణక్రియ సాఫీగా :
ఉదయాన్నే టమాటా రసం తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని నిపుణులంటున్నారు. వీటిలోని డైజెస్టివ్ ఎంజైమ్స్, ఫైబర్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయని తెలియజేస్తున్నారు.
బరువును తగ్గించడంలో :
టమోటా రసం బరువు తగ్గడానికి సహాయపడుతుందట. ఎందుకంటే జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారు రసం తాగడం వల్ల పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించి, అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుందని నిపుణులంటున్నారు.
మొటిమలు, నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? - ఇలా ఈజీగా పోగొట్టండి!
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :
టమాటా రసంలో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. జ్యూస్‌ను తాగడం వల్ల రక్త నాళాలను ఆరోగ్యంగా ఉండి, రక్తపోటు తగ్గుతుందని అంటున్నారు. టమోటాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. దీనివల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడంలో సహాయపడుతుంది.
చర్మం ఆరోగ్యంగా :
రోజు ఉదయాన్నే టమోటా రసం తాగడం వల్ల చర్మం యవ్వవనంగా, ఆరోగ్యవంతంగా ఉంటుందట. వీటిలో ఉండే విటమిన్ సి చర్మ సంబంధ సమస్యలను నివారించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. టమోటాలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Note : టమాటా రసం తాగాలనుకునే వారు ముందుగా వైద్యుల సలహాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీకు అలర్జీ సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలని అంటున్నారు. ఆ తర్వాతే మొదలు పెట్టాలా? లేదా? అనేది నిర్ణయించుకోవాలని చెబుతున్నారు.
నైట్‌షిఫ్ట్ చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు మస్ట్ - లేకుంటే అంతే!
ఈ 3 పనులు చేస్తున్నారా? - అయితే మీరు త్వరగా ముసలివారు అయిపోతారట!