ETV Bharat / sukhibhava

చల్లటి పాలు- ఎసిడిటీకి తిరుగులేని మందు! ఇలాంటి మరో 6 చిట్కాలు మీకోసం!

Acidity Home Remedies In Telugu : ప్రస్తుత కాలంలో జీవనశైలి మారింది. దీంతోపాటు ఆహారపు ఆలవాట్లు కూడా క్రమంగా మారాయి. ఆహారపు అలవాట్లు మారడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో ఎసిడిటీ కూడా ఒకటి. మీరూ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా? మీ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి.

acidity home remedies in telugu
acidity home remedies in telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 4:46 PM IST

Acidity Home Remedies In Telugu : మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. కొందరు ఆరోగ్యానికి చేటు చేసే పదార్థాలను తీసుకుంటున్నారు. ఫలితంగా ఎసిడిటీ లాంటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఎసిడిటీ ఒక సాధారణ జీర్ణ సమస్య. ఇది రావడం వల్ల కడుపు, ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అజీర్ణానికీ కారణమవుతుంది. మోతాదుకు మించి తినటం, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, కారం ఎక్కువ ఉన్నవి తినటం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం కూడా ఎసిడిటీకి రావడానికి దోహదం చేస్తాయి.

మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల అంటే తక్కువ తినటం, హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, సరైన సమాయానికి భోజనం చేయడం, ఒత్తిడికి గురికాకుండా ఉండడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఉండవు. దీంతో పాటు మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఎసిడిటీ తగ్గించడానికి సహజ ఔషధాలు తయారు చేసుకోవచ్చు. అలాంటి 7 నేచురల్ రెమెడీస్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

1. అల్లం
అల్లం మన వంటింట్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. అల్లం టీ, అల్లం జ్యూస్ లేదా భోజనంలో అల్లాన్ని భాగంగా చేసుకుంటే అది ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2. కలబంద
కలబంద అందానికే కాదు, ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో మంట నుంచి ఉపశమనం లభించి ఎసిడిటీ తగ్గుతుంది.

3. ఆపిల్ సైడర్
ఒక గ్లాసు నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి భోజనానికి ముందు తాగడం వల్ల ఎసిడిటీ బాధ తప్పుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కడుపులో ఉన్న యాసిడ్స్​ను తటస్థం చేసి ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

4. సోంపు
ఎసిడిటీని తగ్గించడంలో మీకు ఉపయోగపడే సహజ పదార్థాల్లో సోంపు గింజలు ఒకటి. భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలు తినవచ్చు. లేదా ఒక టీ స్పూను సోంపు గింజల్ని మరిగించి ఫెన్నెల్ టీ తయారు చేసుకుని తాగవచ్చు.

5. చల్లటి పాలు
చల్లటి పాలు ఎసిడిటీకి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ. పాలలోని కాల్షియం కడుపులోని యాసిడ్​ను తగ్గించడానికి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి సాయపడుతుంది. కాబట్టి ఒక గ్లాసు చల్లటి పాలు తాగి ఎసిడిటీని తగ్గించుకోండి.

6. కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లు కూడా ఎసిడిటీని తగ్గిస్తాయి. కొబ్బరి నీళ్లలో ఉండే సహజ ఆల్కలీన్ కడుపులోని ఆమ్లాన్ని తటస్థీకరించి ఎసిడిటీని తగ్గిస్తాయి. గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

7. అరటి పండ్లు
అరటిపండ్లలో ఉండే పొటాషియం ఆమ్లాల్ని తటస్థం చేయడానికి, ఎసిడిటీని తగ్గించడంలో సాయపడుతుంది. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎసిడిటీని నివారించడానికి రోజూ ఒక అరటి పండు తినాలి.

వీటితోపాటు ఎసిడిటీని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలిని పాటించడం కూడా చాలా ముఖ్యం. మసాలా, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా తగినంత భోజనం చేయాలి. రాత్రి ఆలస్యంగా తినడం మానుకోవాలి. యోగా, ధ్యానం లాంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను పాటించండి. ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా ఎసిడిటీ లేదా దానికి సంబంధించిన లక్షణాలతో బాధపడితే వైద్యుల్ని సంప్రదించండి.

నోట్ – ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. ఎసిడిటీకి సంబంధించి వైద్యుల సూచనలు, సలహాలకు ప్రత్యామ్నాయం కాదని గమనించండి. ఎసిడిటీపై ఏవైనా సందేహాలు ఉంటే వైద్యుల్ని సంప్రదించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోండి.

ఎసిడిటీ సమస్యా? ఇంటి చిట్కాలతో తరిమికొట్టండిలా..

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.