Why Doctors Wear Green Clothes During Surgery : ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడానికి ముందు.. వైద్యులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు. అంతేకాదు.. ఆపరేషన్ థియేటర్‌తోపాటు, వార్డు రూమ్‌లలోని కర్టెన్లు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. లేదంటే.. నీలం రంగులో కనిపిస్తాయి. మరి.. దీనికి గల కారణాలేంటి? సైన్స్ ఏం చెబుతోంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైద్యులు ఆకుపచ్చ బట్టలు ధరించడానికి కారణాలివే.. సాధారణంగా మనం వెలుతురులో ఉన్న ప్రదేశం నుంచి.. ఇంట్లోకి లేదా చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు కళ్ల ముందు చీకటి కమ్ముకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. అలాంటి సమయంలో ఆకుపచ్చ లేదా నీలం రంగును చూసినట్టయితే.. వెంటనే రిలీఫ్ పొందుతారు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ల విషయంలోనూ అదే జరుగుతుందట.
కాంతి వర్ణపటంలో ఆకుపచ్చ, నీలం రంగులు.. ఎరుపు రంగుకు విరుద్ధం ఉంటాయి. శస్త్ర చికిత్స సమయంలో డాక్టర్ దృష్టి ఎక్కువగా ఎరుపు రంగులపై ఉంటుంది. అంటే.. రక్తం, కండరాలు వంటి వాటిని తదేకంగా చూస్తూ ఉంటారు. అయితే.. ఎరుపు రంగును చాలా సేపు చూడటం వల్ల కళ్లు అలసిపోతాయి. ఫలితంగా.. ఇతర రంగుల్ని గుర్తుపట్టే శక్తి కొద్దిగా తగ్గుతుంది. ఈ ఇబ్బందుల నుంచి రిలీఫ్ పొందేందుకే.. సర్జరీ టైమ్‌లో వైద్యులు ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉండే దుస్తులను ధరిస్తారట. వీటిని ధరించడం వల్ల సర్జన్ దృష్టి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. ఎరుపు రంగుకు మరింత సున్నితంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!
ఇటీవల.. టుడేస్ సర్జికల్ నర్సు 1998 ఎడిషన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో ఆకుపచ్చ దుస్తులు ధరించడం వల్ల కళ్లకు కొంత విశ్రాంతి లభిస్తుంది. దీంతోపాటుగా.. శస్త్రచికిత్స సమయంలో వైద్యుల దుస్తులకు రక్తపు మరకలు అంటుకునే వీలుంది. ఇవి తెలుగు రంగు దుస్తులకు అంటుకుంటే ఎలా కనిపిస్తాయో తెలిసిందే. కానీ.. గ్రీన్ కలర్ డ్రెస్సులకు రక్తం అంటుకుంటే మరక తక్కువగా కనిపిస్తుంది. ఈ కారణాలతో ఆకుపచ్చ రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారట.
గతంలో తెల్లని దుస్తులు ధరించేవారు : అయితే.. వైద్యులు మొదటి నుంచీ నీలం లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించే సంప్రదాయం లేదు. గతంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది అంతా వైట్ యూనిఫాం ధరించేవారు. కానీ.. 1914లో ఒక వైద్యుడు ఈ సంప్రదాయాన్ని మార్చినట్టు చెబుతారు. తెలుపు దుస్తుల నుంచి ఆకుపచ్చ రంగులోకి మార్చినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ డ్రెస్ కోడ్ ప్రజాదరణ పొందింది. ఇక, ప్రస్తుత రోజుల్లో కొందరు వైద్యులు నీలం రంగు దుస్తులు ధరించి కూడా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.
పక్కటెముక పట్టేసిందా? ఇలా చేస్తే నొప్పి ఇట్టే తగ్గిపోతుంది!
సడెన్‌గా గుండె ఎందుకు ఆగిపోతుంది? హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?