ETV Bharat / sukhibhava

గోళ్లు అందంగా లేవా? - ఈ బెస్ట్ టిప్స్ మీకోసమే! - Best Tips for Healthy Nails

Tips for Healthy Nails : చాలా మంది ఇతర శరీర భాగాల సంరక్షణపై పెట్టిన శ్రద్ధ.. గోళ్లపై పెట్టరు. కానీ మన బాడీలో ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. ఆ మార్పు గోళ్లలో కనిపిస్తుంది. అలాగే.. వాటిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి.. అవి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Tips for Healthy Nails
Tips for Healthy Nails
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 12:36 PM IST

Best Tips for Healthy Nails : మన శారీరక సౌందర్యంలో గోళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి బాడీలో చాలా చిన్న భాగం కావచ్చు కానీ, ఆరోగ్యం విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే డాక్టర్లు కూడా గోళ్ల(Nails)లో కనిపించే ప్రతి చిన్న మార్పు శరీరంలో తలెత్తే అనారోగ్యం తాలూకు సంకేతమని చెబుతుంటారు. కాబట్టి అందరూ ఇతర భాగాల మాదిరిగానే వీటిపై శ్రద్ధ పెట్టడం అవసరం. మీ గోళ్లను ఆరోగ్యంగా, అందంగా, బలంగా ఉంచుకోవడం కోసం అదిరిపోయే చిట్కాలు తీసుకొచ్చాం. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రెగ్యులర్​ వ్యవధిలో కట్ చేసుకోవడం : మీరు ఒక రెగ్యులర్ టైమ్​ ప్రకారం.. గోళ్లను కత్తిరించడం అలవాటు చేసుకోవాలి. అయితే.. గోళ్లను ఎప్పుడూ చర్మానికి పూర్తి దగ్గరగా కత్తిరించకూడదు. దీనివల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాటి అంచులను సున్నితంగా కట్ చేయాలి.

శుభ్రంగా, పొడిగా ఉంచండి : గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎల్లప్పుడూ వాటిని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా మీ చేతులను సబ్బు నీటితో కడుక్కోండి. అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీ గోళ్లను కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టండి. వాటిని నీటిలో ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువసేపు నెయిల్స్ నీళ్లలో నానితే.. వాటి చుట్టూ ఉన్న చర్మం బాగా పొడిగా మారుతుంది. అప్పుడు విరిగిపోవడం, పెళుసుబారడం వంటి సమస్యలు వస్తాయి.

మీ గోళ్లు మాటిమాటికి విరిగిపోకుండా ఈ చిట్కాలు ప్రయత్నించండి!

సేఫ్టీ పాటించండి : గోళ్లతో డబ్బాలు లేదా ప్యాకేజీలు ఓపెన్ చేయకూడదు. అలా చేయడం ద్వారా ఒక్కోసారి అవి విరిగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పనులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి గోళ్లు విరగడమే కాకుండా రక్తస్రావం కూడా అవ్వొచ్చు. తద్వారా వాటి అందం దెబ్బతింటుంది.

మాయిశ్చరైజ్ చేయండి : గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎల్లప్పుడూ మీ నెయిల్స్, క్యూటికల్స్‌ను మాయిశ్చరైజ్ చేయండి. చాలా మంది దీన్ని ఫాలో అవ్వరు. కానీ మీ గోళ్లు, క్యూటికల్స్‌ను హైడ్రేట్‌గా, పొడిగా ఉంచడానికి.. పగుళ్లను నివారించడానికి మాయిశ్చరైజింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణను ప్రేరేపించడంతోపాటు ఆరోగ్యకరమైన గోరు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి తరచుగా మాయిశ్చరైజర్ లేదా​ ఆయిల్​తో గోళ్లు, క్యూటికల్స్​ను మాయిశ్చరైజ్ చేయండి.

ఎక్కువకాలం ఉంచవద్దు : ఎక్కువ మంది చేసే పెద్ద పొరపాటు ఏమంటే.. గోళ్లకు ఒక్కసారి నెయిల్ పాలిష్ పెట్టుకున్నారంటే ఆ రంగు పోయేంత వరకు దానిని పట్టించుకోరు. కానీ.. అది కూడా గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. కాబట్టి నెయిల్ పెయింట్​ ఎక్కువ కాలం ఉంచకుండా చూసుకోవాలి. ఫంక్షన్ల వంటివి పూర్తయిన తర్వాత.. పాలిష్ రిమూవ్ చేసుకోండి. వీటితోపాటు గోళ్లను కొరకడం, నెయిల్ పెయింట్ రిమూవల్​కు కఠిన రసాయనాలు వాడడం లాంటివి చేయకుండా ఉంటే మీ గోళ్లు అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

గోళ్లు కొరికే అలవాటుకు ఇలా చెక్​ పెట్టండి..

గోళ్లు పెంచుకుంటున్నారా...? వెంటనే కత్తిరించండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.