ETV Bharat / sukhibhava

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?-అయితే మీకు IQ ఎక్కువ ఉన్నట్లే! - ఐక్యూ ఎక్కువ ఉందని తెలిపే లక్షణాలు ఏవి

Signs That You Have A High IQ : సాధారణంగా మనం పాలు, నీళ్లు ఇతర ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తాం. అదే ఘన పదార్థాలైతే కేజీల లెక్కన కొలుస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరి ఒక మనిషికి ఉన్న తెలివితేటలను కొలవాలంటే.. కేజీలు, లీటర్లలోకాదు.. వేరే పద్ధతిలో.. అదే ఐక్యూ. అసలు ఐక్యూ అంటే ఏమిటి..? ఐక్యూ ఎక్కువగా ఉందని చెప్పే లక్షణాలు ఏంటి..? ఐక్యూను ఏ విధంగా టెస్ట్​ చేసుకోవాలి ? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Signs That You Have A High IQ
Signs That You Have A High IQ
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 3:18 PM IST

Signs That You Have A High IQ : ఎవరైనా ఒక వ్యక్తికి తెలివితేటలు ఎంత ఉన్నాయి.. అని మనకు తెలియజేసే సాధనం ఐక్యూ. దీన్నే ఇంటెలిజెన్స్ కోషెంట్ (Intelligence Quotient) అంటారు. అంటే ఐక్యూ సంఖ్య ఎంత పెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నమాట. ఒక మనిషికి ఉండే ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్దారిస్తారు. ఈ టెస్టులో అతను నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాడు, ఆలోచన తీరు ఎలా ఉంది.. అనే విషయాల్ని పరిగణలోకి తీసుకుంటారు. అయితే, మన చుట్టూ ఉన్న చాలా మందిలో ఐక్యూ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ విషయం వారికి కూడా తెలియడం లేదని నిపుణులు అంటున్నారు. మీకు ఎక్కువ ఐక్యూ ఉందని చెప్పడానికి ముఖ్యంగా నాలుగు లక్షణాలు మీలో కనిపిస్తాయని అంటున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎక్కువ ఐక్యూ ఉందని తెలిపే నాలుగు లక్షణాలు..

Signs You Have A Higher IQ :

1. కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం..: ఐక్యూ ఎక్కువగా ఉండే వ్యక్తులు ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారని నిపుణులు అంటున్నారు. అలాగే కొత్త అంశాలను మిగతా వారికంటే వేగంగా నేర్చుకుంటారని చెప్తున్నారు. వీరు జ్ఞానాన్ని పెంచుకోవడానికి నిరంతరం పుస్తకాలు చదువుతారని, ఇంట్లో చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటారని చెబుతున్నారు. ముఖ్యంగా ఐక్యూ ఎక్కువగా ఉన్న చిన్న పిల్లలు వారికి తెలియని విషయాన్ని తెలుసుకునే దాకా వారికి నిద్ర పట్టదని.. అందుకే తల్లిదండ్రుల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారని నిపుణులు అంటున్నారు.

2. మంచి మాట తీరు..: అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు మంచి వక్తగా ఉంటారని అంటున్నారు. వీరు ఏ విషయం అయినా సులభంగా అర్థం చేసుకుని ఇతరులకు స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు. వారు మాట్లాడే ముందే అన్ని విషయాలను తెలుసుకుని మాట్లాడతారని, తొందరపాటు నిర్ణయాలను తీసుకోరని నిపుణులు చెప్తున్నారు.

3.సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు..: అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు సాధారణంగా సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారని అంటున్నారు నిపుణులు. వారు.. సమస్యలను అన్ని కోణాల నుంచి పరిశీలించి, సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటారని చెబుతున్నారు. క్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండి నిర్ణయాలను తీసుకుంటారని చెప్తున్నారు.

4. క్రియేటివిటీ: అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు క్రియేటివ్​గా ఆలోచిస్తారని నిపుణులు అంటున్నారు. వీరు సమాచారాన్ని విశ్లేషించి, సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని కనుక్కుంటారని తెలుపుతున్నారు. కొంత మంది కళలు, సంగీతం, రచన వంటి రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారని చెబుతున్నారు.

వీగన్ డైట్​పై సందేహాలా? నిపుణుల క్లారిటీ ఇదే!

ఐక్యూ టెస్ట్‌ను ఎలా పరీక్షించుకోవాలంటే ?

How to Test IQ: ఐక్యూ టెస్ట్‌లు తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

  1. ఆన్‌లైన్‌ ఐక్యూ టెస్ట్‌..: ఇంటర్నెట్‌లో కొన్ని వందల వెబ్‌సైట్‌లు ఉచితంగా ఐక్యూ టెస్ట్‌ను చేస్తున్నాయి. కానీ, ఇవి కచ్చితమైన రిజల్ట్స్​ అందించలేవని నిపుణులు అంటున్నారు.
  2. సర్టిఫైడ్ సైకాలజిస్ట్‌ను కలవడం..: మానసిక నిపుణులను కలిసి ఐక్యూ టెస్ట్‌ను పరీక్షించుకోవచ్చు. వీరు నిర్వహించే ఐక్యూ పరీక్షలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.
  3. మెన్సా అడ్మిషన్ టెస్ట్..: మెన్సా అనేది ప్రపంచంలోనే ఐక్యూ టెస్ట్‌ను చేసే సంస్థలలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా చెబుతారు. ఈ మెన్సా ఐక్యూ అడ్మిషన్‌ టెస్ట్ కోసం మీరు రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అత్యంత కచ్చితమైన ఐక్యూ టెస్ట్‌ను అందిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
  • మెన్సా అడ్మిషన్‌ టెస్ట్‌ ఎలా పొందాలంటే.. మొదట లైసెన్స్ పొందిన సైకాలజిస్ట్‌ నుంచి 98 లేదా అంతకంటే ఎక్కువ ఐక్యూను స్కోర్‌ను చేయాలి. ఈ టెస్టులు కొంత ఖర్చుతో కూడుకున్నవి, కానీ అత్యంత కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
  • రెండో విధంగా మెన్సా సర్టిఫైడ్‌ ఆన్‌లైన్ ఐక్యూ టెస్ట్‌ల ద్వారా కూడా అడ్మిషన్‌ పొందవచ్చు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, కానీ, సైకాలజిస్ట్‌ ఇచ్చిన కచ్చితమైన ఫలితాలను ఇవి అందించలేవని చెబుతున్నారు. ఐక్యూ టెస్ట్ ఫలితాలను సాధారణంగా ఐక్యూ స్కోర్‌గా ఇస్తారు. సగటు ఐక్యూ స్కోర్ 100గా ఉంటుంది. ఐక్యూ స్కోర్ 130 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఆ వ్యక్తికి ఎక్కువ ఐక్యూ ఉందని అంటారు. ఐక్యూ స్కోర్ 70 లేదా అంతకంటే తక్కువ ఉంటే, వ్యక్తిని ఇంటలెక్చువల్లీ డిసెబుల్‌డ్‌ అని అంటారు.

కంటి నిండా నిద్రపోవాలా? మీరు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్​ ఇదే!

కుక్కలకు పచ్చి మాంసం తినిపిస్తున్నారా? మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.