Reason Behind Headache in Men and Women: చాలా మందిని వయసుతో సంబంధం లేకుండా ఇబ్బందిపెట్టేది తలనొప్పి. ఇది రావడానికి ఫలానా కారణం అంటూ ఉండదు. "ఆ ఏముందిలే తలనొప్పేగా ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే" అని నిర్లక్ష్యం చేస్తుంటారు చాలా మంది. కానీ.. ఇలా చేస్తే సమస్యలు తప్పవు. ఎందుకంటే.. కొన్ని తలనొప్పులు ప్రమాదకరమైన జబ్బులకు సంకేతం కావచ్చు. తలనొప్పిపై ఇటీవల అమెరికా వైద్య నిపుణులు జరిపిన ఓ అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
వారిలోనే ఎక్కువగా: అమెరికాలో దాదాపు 11 కోట్ల మంది తలనొప్పి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనంలో గుర్తించారు. దీనికి సంబంధించి ‘జర్నల్ ఆఫ్ హెడేక్ అండ్ పెయిన్(Journal of Headache and Pain)’ పేరుతో ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. అందులో.. తలనొప్పి స్త్రీ, పురుషుల్లో వేర్వరుగా ఉంటుందని స్పష్టం చేశారు. జెంట్స్ కన్నా కూడా లేడీస్‌కే తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు మహిళలు ఈ సమస్య కారణంగా తీవ్రమైన అనారోగ్యం ఎదుర్కొంటున్నారని అందులో వివరించారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు.
కళ్లలో ఈ లక్షణాలు - చూపు కోల్పోవడం ఖాయం - బీకేర్ ఫుల్!
హార్మోనల్ సమస్యల వల్ల తలనొప్పి: సాధారణంగా స్త్రీలల్లో పీరియడ్స్ కారణంగా శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు ద్వారా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని అధ్యయనంలో స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, మెనోపాజ్ దశలోనూ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని.. ఈ కారణంగానే తలనొప్పి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో తగ్గినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు.
అలాగే చిన్న వయసులో తలనొప్పి బారిన పడే వారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉందని ఈ స్టడీలో పేర్కొన్నారు. అయితే.. వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుందని.. దానికి కారణం పురుషుల శరీరంలో హార్మోన్లు యుక్త వయసుకు వచ్చిన అనంతరం స్థిరంగా ఉంటాయని.. పెద్దగా మార్పులు ఉండవు కాబట్టి.. ఈ కారణంగానే వారిలో తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు.
ఎసిడిటీ ముదిరితే జరిగేది ఆ ఘోరమే - కడుపులోని మంట ఇలా ఆర్పేయండి!
పని ఒత్తిడి : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా దీని కారణంగా తలనొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. అధ్యయనంలో భాగంగా ఒక లక్ష మంది ఉద్యోగులను పరీక్షించగా వారిలో కనీసం 600 వరకు కేసులు తీవ్రమైన తలనొప్పి కారణంగా అనారోగ్యం పాలైనట్లు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం.. పనిలో ఒత్తిడి అని తేలింది. ఒత్తిడితో పాటు ఆందోళన కూడా తలనొప్పి పెరిగేందుకు కారణం అని చెబుతున్నారు. అలాగే నిద్ర విషయంలో కూడా, పొరపాట్లు చేసినట్లయితే తలనొప్పి తప్పదని హెచ్చరిస్తున్నారు.
పరిష్కారం ఏంటి: మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అంటే. సింపుల్ పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా, సరైన పోషకాహారం తీసుకోవడం, ప్రశాంతంగా ఉండటం, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
చలికాలంలో పిల్లలకు న్యూమోనియా ప్రమాదం - ఇలా చేయండి - లేకపోతే ఇబ్బందే!
ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? - కరివేపాకుతో ఊహించని మార్పు - తేల్చిన రీసెర్చ్!