ETV Bharat / sukhibhava

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..! - చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం

Hyderabadi Chicken Dum Biryani Recipe : "బిర్యానీలందు హైదరాబాద్ దమ్ బిర్యానీ వేరయా" అంటారు ఫుడ్ లవర్స్. అంతే మరి..! మసాలా నషాళానికి తాకుతుంటే.. హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదించడం అనిర్వచనీయమైన అనుభూతిగా ఫీలవుతుంటారు. మరి, అలాంటి బిర్యానీ మన ఇంట్లోనే తయారు చేస్కుంటే..? సండే పండగైపోదూ..! మరి ఇంకెందుకు ఆలస్యం..? ఇంట్లో శ్రీవారు చికెన్ షాపు వద్దకు వెళ్లండి.. శ్రీమతి మసాలాలు సిద్ధం చేస్కోండి.. "ఈటీవీ భారత్" అందిస్తున్న రెసిపీని ప్రిపేర్ చేయండి

Hyderabadi Chicken Dum Biryani Recipe
How to Prepare Hyderabadi Chicken Dum Biryani
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 8:00 PM IST

Updated : Sep 3, 2023, 9:32 AM IST

Hyderabadi Chicken Dum Biryani Recipe in Telugu : హైదరాబాద్ అనగానే ఫుడ్ లవర్స్ అందరికీ దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఇక హైదరాబాదీల వీకెండ్​ మెనూ కార్డ్​లో ముక్క ఉండి తీరాల్సిందే. ఆ పీస్ బిర్యానీలోదైతే అద్భుత: అంటారు. అందుకే భాగ్యనగరం వ్యాప్తంగా ప్రతీ గల్లీలోనూ బిర్యానీ హోటళ్లు మనకు దర్శమిస్తుంటాయి. మన హైదరాబాద్ దమ్​కీ చికెన్ బిర్యానీ(Chicken Dum Biryani) కి.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మరి, అలాంటి బిర్యానీని సండే పూట ఇంట్లోనే రెడీ చేస్తే ఎలా ఉంటుంది?

Chicken Dum Biryani Recipe Process : ఇవాళ ఆదివారం.. ఈ సండే మూడ్​లో చాలా మంది ఆలస్యంగా నిద్ర లేచేందుకు చూస్తుంటారు. కాబట్టి చాలా మంది బ్రేక్​ఫాస్ట్ కూడా స్కిప్ అయిపోతుంది. సో.. లంచ్ ఏ రెస్టారెంట్(Restaurants)​ లో చేద్దామా? అని ప్లాన్ చేస్తుంటారు. అయితే.. అదేమీ అవసరం లేకుండా ఇంట్లోనే ఘుమఘుమలాడే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ సిద్ధం చేసుకోండి.

చాలా మంది దమ్ బిర్యానీ అనగానే ఎక్కువ టైమ్ పడుతుందనీ.. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందనీ.. ఇంట్లో చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. కానీ.. నిజానికి అలాంటిదేం లేదు. పక్కా ప్రిపరేషన్ ప్లాన్​తో.. దమ్ బిర్యానీ చేయడం ఈజీనే. మరి, ఇంకెందుకు ఆలస్యం? బిర్యానీ తయారు చేయడానికి సిద్ధమైపోండి.. ఎలా చేయాలో.. ఏమేం కావాలో.. మేం చెప్తాం.

Hyderabadi Chicken Dum Biryani Ingredients :

చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :

  • చికెన్‌ - కిలో
  • బాస్మతి రైస్- కిలో
  • వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు
  • పచ్చిమిరపకాయలు- 8
  • లవంగాలు-8
  • దాల్చిన చెక్క-4
  • యాలకులు-7
  • జాపత్రి,
  • జాజికాయ
  • మరాఠి మొగ్గ
  • బిర్యానీ ఆకు
  • షాజీరా
  • నిమ్మరసం,
  • అల్లంవెల్లుల్లి ముద్ద,
  • జీలకర్ర,
  • ధనియాల పొడి,
  • ఉప్పు- తగినంత,
  • పెరుగు- రెండు కప్పులు,
  • నూనె- తగినంత,
  • కొత్తిమీర, పుదీనా- కప్పు చొప్పున,
  • పాలు- కొన్ని
  • కుంకుమపువ్వు,
  • ఫుడ్ కలర్ (కావాలనుకుంటే)

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

బిర్యానీ కోసం చికెన్ మారినేషన్ విధానం :

How to Marinate Chicken for Dum Biryani :

  • ముందుగా.. చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి రెండు గంటలపాటు పక్కన పెట్టాలి.
  • ఆ తర్వాత నీళ్లను పారబోసి ముక్కలను గిన్నెలో వేసుకోవాలి.
  • ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చికెన్‌ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
  • తర్వాత నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు-2, దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠి మొగ్గ, షాజీరా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత పెరుగు వేసి బాగా కలిపి.. పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత నూనె వేసి మరోసారి కలియబెట్టాలి. ఆ తర్వాత దాన్ని ఓ గంట పాటు పక్కన పెట్టాలి.
  • వేరొక గిన్నెలో బియ్యాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టాలి.

How to Make Hyderabadi Chicken Dum Biryani Recipe :

దమ్ బిర్యానీ తయారీ విధానమిలా : స్టవ్‌ మీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. కప్పు బియ్యానికి నాలుగు కప్పుల చొప్పున తీసుకోవాలి. ఆ నీటిలో ఉప్పు వేసి మరిగించాలి. ఇందులో షాజీరా, దాల్చిన చెక్క, జాజికాయ, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి కాస్తంత నూనె పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఓసారి కలపాలి. మూడొంతులు ఉడికిన తర్వాత మంటను చిన్నగా చేసి చిల్లుల గరిటెతో అన్నాన్ని తీస్తూ చికెన్‌ మిశ్రమంలో పొరలా వేసుకోవాలి. ఇలా సగం అన్నం వేయాలి. దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు, నిమ్మరసం వేసుకోవాలి. కాస్త గులాబీ నీళ్లు పోసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్​ను పొరలా వేసుకోవాలి.

చివరగా పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కుంకుమపువ్వు పాలు లేదా ఫుడ్​ కలర్​, నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టి.. ఆవిరి బయటకు వెళ్లనివ్వకుండా.. అంచులను గోధుమపిండితో పూర్తిగా మూసి, ఏదైనా బరువును పెట్టాలి. మొదట పది నిమిషాలు మంట పెద్దగా, ఆ తర్వాత మరో పదినిమిషాలు మధ్యస్థంగా, మరో పది నిమిషాలు చివరికి సిమ్​లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆప్​ చేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్‌ దమ్‌ బిర్యానీ రెడీ. ఆనియన్, లెమన్​ తో గార్నిష్ చేసుకొని.. సర్వ్ చేసుకుంటే.. రెస్టారెంట్​కు తీసిపోతుందా! పిల్లలు హోమ్ బిర్యానీ.. కేక అంటారు..!

Chettinad Chicken Recipe : సండే స్పెషల్.. నోరూరించే చెట్టినాడ్ చికెన్

Dragon Chicken Recipe: రెస్టారెంట్​ స్టైల్​లో డ్రాగన్​ చికెన్​.. ట్రై చేయండి!

Hyderabad Biryani : హైదరాబాదీలా మజాకా.. 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు లాగించేశారు

Last Updated : Sep 3, 2023, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.