చిరుతిళ్లు, పిండివంటలు ఏవి తయారుచేసినా అందులో చిటికెడు వాము వేయాల్సిందే. ఇది ఆహారానికి రుచితోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..
- వాములో ఔషధ గుణాలెక్కువ. విరేచనాలతో బాధపడుతున్నవారు వాము నీళ్లను తాగితే ఉపశమనంగా ఉంటుంది.
- వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
- దీన్ని చిన్నా, పెద్దా అందరూ తినొచ్చు.
- వాము పొడితో దంతాలను శుభ్రం చేసుకుంటే చిగుళ్లు బలంగా మారతాయి.
- జలుబుతో బాధపడేవారు వామును ఓ వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే ఉపశమనంగా ఉంటుంది.
- అన్నంలో వాము పొడిని వేసుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
- వాము రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే అతిసారం, అజీర్తి తగ్గుముఖం పడతాయి.
- మూత్ర సంబంధ సమస్యలను నియంత్రిస్తుంది. పుల్లటి తేన్పులను తగ్గిస్తుంది.
- కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే సమస్య తగ్గుతుంది.
- గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడగట్టి వేడి వేడిగా తాగితే పొట్టలోని గ్యాస్ తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఈ పొడిని నమిలితే కూడా గ్యాస్ తగ్గిపోతుంది.
ఇదీ చూడండి : custard apple benefits: సీతాఫలంలో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా?