ETV Bharat / sukhibhava

బ్లాక్​హెడ్స్​తో ఇబ్బంది పడుతున్నారా?- ఈ టిప్స్​ ఫాలో అయ్యి మీ సమస్యకు స్వస్తి పలకండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 1:17 PM IST

Best Home Remedies to Avoid Blackheads: చాలామంది సౌందర్యపరంగా ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్‌హెడ్స్ ఒకటి. అయితే ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించే వీటికి స్వస్తి పలకచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం రండి..

Best_Home_Remedies_to_Avoid_Blackheads
Best_Home_Remedies_to_Avoid_Blackheads

Best Home Remedies to Avoid Blackheads on Nose: ముఖం.. అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..? కానీ, మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు వంటి సమస్యలు.. ముఖాన్ని అందవిహీనంగా మారుస్తూ ఉంటాయి. అయితే.. వీటిల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది బ్లాక్​హెడ్స్​. ఈ బ్లాక్ హెడ్స్ తొలగిచడానికి ఫేస్ స్క్రబ్, బ్లాక్ హెడ్స్ రిమూవల్ ఫేస్ వాష్, రకరకాల క్రీమ్లు వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు.. ఈ సమస్యను తొలగించుకోవడానికి పార్లర్లకు కూడా వెళ్తూ ఉంటారు. అయితే కాస్త సమయం వెచ్చించి, ఓపిక వహిస్తే ఇంట్లోనే వాటిని సులభంగా తొలగించుకోని.. అందంగా రెడీ కావచ్చు.

అసలు బ్లాక్‌ హెడ్స్‌ ఎందుకు వస్తాయ్‌..?: చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి ఆయిల్స్ విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలినాలు తోడయ్యి బ్లాక్​హెడ్స్​ ఏర్పడతాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే దుమ్ము, ధూళీ, వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారిలోనూ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. మరి ముక్కు మీద ఉన్న బ్లాక్​హెడ్స్​ను తొలిగించే నివారణ మార్గాలను ఇప్పుడు చూద్దాం..

స్టీమింగ్​: ఆవిరి పట్టడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒక పాత్రలో బాగా మరిగించిన నీళ్లు తీసుకొని ఆ ఆవిరిని ముఖానికి పట్టాలి. ఇందుకోసం ఒక టవల్ ఉపయోగించి తల మీదుగా కవర్ చేయాలి. ఇలా ఒకటి నుంచి రెండు నిమిషాలు ముఖానికి ఆవిరి పట్టి తీసేయాలి. ఈ విధంగా మూడు లేదా నాలుగుసార్లు చేయాలి. తర్వాత బ్రౌన్ షుగర్‌తో మృదువుగా మర్దన చేసుకోవడం ద్వారా బ్లాక్‌హెడ్స్ తొలగిపోవడంతో పాటు మోము కూడా ప్రకాశవంతంగా మారుతుంది. అయితే ముఖానికి మరీ ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలాగే నీళ్లు మరీ ఎక్కువ వేడిగా ఉన్నా చర్మానికి హాని కలగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి.

బేకింగ్​ సోడా: బేకింగ్ సోడా నేచురల్​ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ముందుగా ఒక టీ స్పూన్​ బేకింగ్ సోడా తీసుకుని దానికి కొంచెం నీరు కలిపి పేస్ట్​లాగా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్​ను ముక్కు మీద రౌండ్​ షేప్​లో ఒకటి లేదా రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ విధానాన్ని వారానికి ఓ సారి ట్రై చేయండి.

దాల్చిన చెక్క అండ్​ తేనె: దాల్చిన చెక్క బ్లాక్​హెడ్స్​ సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి పేస్టు లాగా చేసి ముక్కు మీద అప్లై చేసుకోండి. 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయండి. దాల్చిన చెక్క చర్మ రంధ్రాలను టైట్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం: నిమ్మరసంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి.. మొటిమలు, బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్ వంటి సమస్యలతో పోరాడతాయి. ఒక స్పూన్​ నిమ్మరసంలో కాటన్​ ముంచి ముక్కు మీద అప్లై చేసుకోండి. సుమారు 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

టీట్రీ ఆయిల్​: టీట్రీ ఆయిల్​ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది బ్లాక్ హెడ్స్‌ను నివారించడానికి సాయపడుతుంది. కొద్దిగా టీట్రీ ఆయిల్​ తీసుకుని.. అందులో కాటన్​ ముంచి.. తర్వాత ముక్కు మీద స్మూత్​గా అప్లై చేయండి. తర్వాత ఓ పది నిమిషాల తర్వాత వాష్​ చేసుకోండి.

Note: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.