ETV Bharat / sukhibhava

శృంగారం.. ఓ అత్యద్భుత కార్యం - శృంగారాన్ని అపోహలు

మనం అన్నింటికీ ముందే సంసిద్ధమవుతుంటాం! పెళ్లికి ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటాం. కాపురానికి ముందే ఇల్లు చూసుకుంటాం. పిల్లలకు ముందే బడిలో సీటు మాట్లాడుకుంటాం. విరమణకు ముందే డబ్బు దాచుకుంటాం. ఇలా అన్నింటికీ ముందు నుంచే సిద్ధమవుతుండే మనం.. జీవితంలో అత్యంత కీలక అంశమైన లైంగిక జీవనం విషయంలోనూ ఇంతే సంసిద్ధత ప్రదర్శిస్తున్నామా? లేనే లేదంటున్నారు నిపుణులు!

romance
శృంగారం
author img

By

Published : Oct 25, 2021, 11:20 AM IST

శృంగారాన్ని చీకటి వ్యవహారంగానే చూస్తున్నాం. చాటుమాటు తంతుగానే దాచేస్తున్నాం. అభంశుభం తెలీని పసిబిడ్డల వయసు నుంచీ ఛీచ్ఛీ అంటున్నాం. నవయవ్వన ఘడియల్లో ఇవ్వాల్సిన విజ్ఞానం ఇవ్వటం లేదు. దాంపత్యంలోనూ దాగుడుమూతలే ఆడుతున్నాం. ఇక మలివయసులో ఇదేం ముచ్చటని (Sexual Interest) ఈసడించేస్తున్నాం. ప్రతి దశలోనూ మన ధోరణి అశాస్త్రీయంగానే సాగుతోంది. శాస్త్రీయమైన అవగాహనతో.. చక్కటి శృంగార జీవితాన్ని బాధ్యతాయుతంగా ఆస్వాదించేలా చెయ్యటం ఒక్కటే దీనికి సరైన విరుగుడు. అందుకే దీనికి సంబంధించిన వివరాలను సరళంగా మీ ముందుకు తెస్తోంది ఈటీవీ భారత్​.

మనలో చాలామంది గుండె జబ్బు వచ్చినప్పుడే గుండె గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎముకలు విరిగినపుడే వాటి గురించి పట్టించుకుంటారు. ఏదైనా అంతేగానీ.. ఒక్క శృంగారం విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలామంది ప్రతి రోజూ, రోజులో ఎన్నో సార్లు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ముఖ్యంగా భాగస్వామితో తన సంబంధాలు బాగానే ఉన్నాయా? సంతృప్తిగానే ఉందా? లేక పరిస్థితి ఎక్కడైనా గాడి తప్పుతోందా అన్న ఆలోచన రోజులో ఎన్నోసార్లు పలకరిస్తూనే ఉంటుంది. మన జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాముఖ్యం అంతటిది. కానీ దురదృష్టవశాత్తూ మన సమాజంలో లైంగిక ఆరోగ్యానికి దక్కాల్సినంత గౌరవం, మన్నన దక్కకుండా పోతున్నాయి.

మన సంస్కృతిలో సెక్స్‌ పట్ల రకరకాల వైరుధ్య భావనలు రాజ్యమేలుతున్నాయి. శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది, అందరూ లైంగిక చర్యల పట్ల అనురక్తి కనబరుస్తూనే ఉంటారు. కానీ శృంగారం గురించి బయటకు మాట్లాడటానికి వచ్చేసరికి మాత్రం అంతా 'ఛీ చ్ఛీ' అంటుంటారు. ఇలా చీదరించుకునే వారు, ముఖం చిట్లించుకునేవారు, ఇటువంటి విరుద్ధ భావాల్లో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు... ఎప్పుడూ కూడా లైంగిక జీవితంలో తాము పొందాల్సినంతటి ఆనందాన్ని పొందలేరు. భాగస్వామికీ ఇవ్వాల్సినంతటి తృప్తిని ఇవ్వలేరు. శృంగారాన్ని అపోహల నుంచి బయటకు తీసుకువచ్చి, దీన్నొక శాస్త్రంగా అర్థం చేసుకోవటం చాలా అవసరం. శృంగార వృక్షానికి చిన్నతనం నుంచే బీజాలు పడాలి. నవయవ్వనం నుంచీ వృద్ధాప్యం వరకూ ప్రతి దశలోనూ దాన్ని ఆరోగ్యకరంగా, బాధ్యతాయుతంగా పెంచి పోషించుకుంటూ రావాలి.

పసివయసు ముచ్చట

ఆశ్చర్యకరంగా అనిపించినా.. శృంగార, సాన్నిహిత్య భావనల పట్ల మనిషికి ఆసక్తి పసితనం నుంచే మొదలవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఒకరినొకరు తాకటం, కౌగిలించుకోవటం వంటివన్నీ పిల్లలు బాల్యం నుంచే ఒక కంట గమనిస్తుంటారు. ఇలాంటి పిల్లల్లో ప్రేమాస్పదనమైన భావనలు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. అసలు ఒకరిపై ఒకరు ఎలాంటి ప్రేమలూ ప్రదర్శించని, ఎడమొగం పెడమొగంగా ఉండే తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలు.. పెద్దయ్యాక తామూ అంతే జడంగా తయారవుతుంటారు. కుటుంబంలో స్త్రీపురుషుల మధ్య సంబంధాలు ఎంతటి అన్యోన్యంగా, ఆనందంగా ఉంటాయో తెలియకుండా పెరిగే పిల్లలు.. బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు సరైన ఆలోచనా ధోరణి కొరవడి, ఏం చెయ్యాలో తెలియక.. పెడతోవ పట్టే ప్రమాదం ఉంటుంది. పుస్తకాలను చదివి అరకొర విషయాలను నేర్చుకోవటం, సినిమాలను చూసి అదే నిజమని భావించటం వంటివన్నీ వారిని రకరకాల సాహసాలకు పురిగొల్పుతుంటాయి.

పసిబిడ్డలు తమ శరీరంలో ఇతరత్రా భాగాలను తాకినట్లుగానే జననాంగాల మీదా చేతులు పెట్టుకోవటం సహజం. అందులో పెద్ద తప్పేమీ లేదు. కానీ దాన్ని చూస్తూనే ఇంట్లో పెద్దవాళ్లు 'చ్ఛీ చ్ఛీ' అంటూ చటుక్కున చెయ్యి తీసేయిస్తుంటారు. పసివయసులో ఎదురయ్యే ఇలాంటి అసాధారణ అనుభవాల ప్రభావం- పిల్లల మీద బలంగా ఉంటుంది. ఇది మున్ముందు వాళ్ల లైంగిక ధోరణులను, ఆలోచనలను ఎంతో ప్రభావితం చేస్తుందని గుర్తించాలి. అందుకని ఇలాంటి విషయాల్లో పెద్దలు అవగాహనతో మెలుగుతూ.. పిల్లలను చక్కటి 'రేపటి' కోసం సంసిద్ధం చెయ్యటం చాలా అవసరం.

యవ్వన ఘడియలు

యుక్తవయసులో అడుగుపెట్టే తరుణంలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు వస్తుంటాయి. కానీ మన సమాజంలో- ఈ మార్పుల గురించి పిల్లలను ఏ రకంగానూ సన్నద్ధం చెయ్యటం లేదు. దీనివల్ల ఏదో ఒక రోజు ఉన్నట్టుండి అబ్బాయి అంగం నుంచి తెల్లటి స్రావం వస్తుంటే చూసి గాభరా పడిపోవటం, ఆడపిల్లలైతే ఉన్నట్టుండి రుతుస్రావం జరిగితే తమకేదో జరిగిపోయిందని బెంబేలెత్తిపోవటం వంటి అనుభవాలు సర్వసాధారణమవుతున్నాయి. అప్పటి వరకూ కేవలం మూత్ర విసర్జన మాత్రమే జరుగుతుండే అవయవం నుంచి తెల్లటి, చిక్కటి స్రావం వస్తుంటే ఎవరు మాత్రం కంగారుపడరు? వీటి గురించి ముందే పిల్లలను మానసికంగా కొంత సంసిద్ధులను చేస్తే ఈ గందరగోళాలుండవు. జననాంగాల వద్ద సన్నటి రోమాలు మొలుస్తుండటం, అమ్మాయిల్లో రొమ్ములు పెరగటం.. ఇలాంటివన్నీ సహజమైన మార్పులని పిల్లలకు కాస్తముందు నుంచే అవగాహన ఉండాలి. అబ్బాయిలకు ఉదయాన్నే నిద్రలేవటానికి ముందు అంగం గట్టిపడుతుండొచ్చు.

ఆడపిల్లలకు తమ జననాంగాలను ముట్టుకోవాలని అనిపిస్తుండొచ్చు. ఇలాంటి మార్పులను చూసి పిల్లలు ఆశ్చర్యానికి, భయభ్రాంతులకు, లేదంటే సిగ్గుపడే పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి పిల్లలు యుక్తవయసుకు దగ్గర అవుతున్న దశలోనే తల్లిదండ్రులు వారితో అనునయంగా మాట్లాడుతూ- మీ శరీరాల్లో మున్ముందు ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, ఇవి ప్రకృతి సహజమైన మార్పులే, మనల్ని పునరుత్పత్తి, సంతానం కోసం.. సరికొత్త పాత్రల కోసం సంసిద్ధం చేసే మార్పులివి.. అని వివరిస్తే పిల్లల మనసుల్లో గందరగోళాలకు ఆస్కారం ఉండదు. అమ్మాయిలకు రుతుక్రమం గురించి, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించటం చాలా అవసరం. తల్లిదండ్రులీ పని చెయ్యకపోతే.. వాళ్లు స్నేహితుల ద్వారానో, పుస్తకాలు చదివో ఏవేవో అరకొర విషయాలు తెలుసుకుని, అవే నిజమనుకొని భ్రమల్లోనూ, భయాల్లోనూ కూరుకుని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకునే ప్రమాదముంది. ఇవన్నీ మున్ముందు లైంగిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని గుర్తించాలి.

ఈ రెండూ పోవాలి!

'శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ 'ఛీ చ్ఛీ' అనటం.. లేదంటే దాన్నో 'మజా, థ్రిల్లు' వ్యవహారంగా చూడటం.. ఈ రెండు ధోరణులూ తప్పే. ఈ రెండూ పోవాలి. ఏ నాగరీక సమాజమూ కూడా శృంగారాన్ని ఛీఛీ అనదు. దాన్ని మానవ జీవితాల్లో అత్యంత కీలకమైన అంశంగా స్వీకరిస్తుంది. అంతేకాదు, దాన్ని సామాజిక జీవితంలోనూ ముఖ్యమైన అంశంగా గుర్తిస్తుంది. మన పూర్వీకులు కూడా శృంగారాన్ని ఓ అత్యద్భుత కార్యంగా భావించారు. దాన్నో శాస్త్రంలాగా, మానవ మనుగడకు అవసరమైన గౌరవప్రదమైన విజ్ఞానంగా గుర్తించారు. కామసూత్రమే ఇందుకు తార్కాణం. ఇంతటి విశాల దృక్పథం కాస్తా కాలక్రమంలో కుచించుకుపోయి.. క్రమేపీ అపోహల్లోకీ, అర్థరహిత భావనల్లోకీ జారిపోయింది. దీంతో శృంగారమన్నది అన్యోన్యమైన ఆనందాన్నిచ్చే అంశమని కూడా చాలామంది తెలుసుకోవటం లేదు. అదేదో హడావుడిగా చీకట్లో ముగించెయ్యాలన్న తొందరపాటు ధోరణిలో కొట్టుకుపోయే వారూ ఉన్నారు. నిజమైన శృంగారం ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలను ప్రోత్సహిస్తుంది!

'మన జీవితంలో ఆకలి, నిద్ర మాదిరిగానే శృంగారం కూడా ఒక సహజాతం. సర్వ సహజ భావన. ఇదేమీ చెడ్డ విషయం కాదు. దీనికి మనం లేనిపోని పవిత్రత ఆపాదించి, నైతికపరమైన బంధనాల్లో ఇరికించటం వల్ల లైంగిక ఆరోగ్యం విషయంలో సమాజంలో లేనిపోని అపోహలు, అపనమ్మకాలు, అర్థసత్యాలు, అసత్యాలు రాజ్యమేలుతున్నాయి. అయితే సహజాతం కదా అని మనిషి ఎలాంటి నిబంధనలూ, కట్టుబాట్లూ లేకుండా ఉండే పరిస్థితి లేదు.

ఎందుకంటే ఇతర జంతుజాలం లాగా మనిషి కేవలం సంతానాన్ని కనేసి, సమాజానికి వదిలేసి వెళ్లిపోయే రకం కాదు. మనుషుల విషయంలో పెంపకానికీ అత్యధిక ప్రాధాన్యం ఉంది, ఇందులో స్త్రీపురుషులు ఇరువురికీ నిర్దిష్టమైన పాత్రలున్నాయి. కాబట్టి స్త్రీపురుషుల బాధ్యతలు పడక గదితో ముగిసిపోయేవి కాదు.. తల్లిదండ్రులుగా ఆ తర్వాత కూడా వాళ్లు అంతకు మించిన బాధ్యతలను పోషించాల్సి ఉంటుంది. అందుకే మానవ సమాజానికి వచ్చేసరికి శృంగారానికి పద్ధతులు, నియమాలు పుట్టుకొచ్చాయి. వీటిని మనం కాదనలేం. అలాగని దురవగాహనల్లో కూరుకుపోలేం. శాస్త్రీయ దృక్పథంతో వీటన్నింటినీ పటాపంచలు చేసుకోకపోతే లైంగిక జీవితాన్ని ఆనందించాల్సినంతగా ఆస్వాదించలేమని చెప్పక తప్పదు. ఈ అవగాహన అన్నది పుస్తకాలతో వచ్చేది కాదు. ఇందుకు మొత్తం సామాజిక వైఖరిలోనే మార్పు రావాలి.'

బాధ్యతాయుత దాంపత్యం

శృంగారమన్నది ఏమాత్రం చీకటి వ్యవహారం కాదు. ఆబగా, ఆదరాబాదరగా కానిచ్చే పని అంతకంటే కాదు. ముఖ్యంగా పెళ్లైన తర్వాత మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరముంటుంది. సెక్స్‌ అంటే అంగాంగ సంభోగం ఒక్కటే కాదు.. భాగస్వామని అర్థం చేసుకోవటం, ఇష్టాయిష్టాలను గౌరవించటం వంటి ఎన్నో అంశాలతో ముడిపడిన వ్యవహారమన్న విస్తృతమైన అవగాహన ఉండాలి. అప్పుడే సెక్స్‌ను మరింతగా ఆస్వాదించే అవకాశముంది. నిజానికి పెళ్లైన కొత్తలో దంపతులకు అంతా కొత్తగా ఉంటుంది. అంతకు ముందు పుస్తకాల్లో చదివిన విషయాలకూ, తమకు అనుభవంలో ఎదురవుతున్న పరిణామాలకూ పొంతన ఉండకపోవచ్చు. అప్పటికే నీలి చిత్రాల వంటివి చూసిన కొందరు.. తమ జీవితం అలా లేదేంటని నిరాశలోకి జారి, జావగారిపోతుంటారు.

బయటికి చెప్పకోలేక లోలోపలే మథనపడుతుంటారు. అంగ ప్రవేశానికి భాగస్వామి సహాయం అవసరమన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కాబట్టి నూతన దంపతులకు ముందు నుంచే లైంగిక ఆరోగ్యంపై చక్కటి అవగాహన ఉండటం అవసరం. శృంగారమన్నది ఒక బాధ్యతాయుతమైన చర్య అన్న విషయం వారికి తెలిసి ఉండాలి. వెంటనే సంతానం కనాలా వద్దా? వద్దనుకుంటే ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడాలి? ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తొచ్చు? అవాంఛిత గర్భాలంటే ఏమిటి? ఇవన్నీ ముందే తెలియాలి. అలాగే అపోహల్లో కూరుకోకూడదు. ఫలానా నెలలో ఫలానా పూర్ణిమ రోజు కలిస్తే ఏదో అయిపోతుందని చెప్పటం వంటి లక్షలాది అపోహలు మన సమాజంలో రాజ్యమేలుతున్నాయి. వీటివల్ల శాస్త్రీయ దృక్పథం కొరవడుతుంది. శృంగారమన్నది బాధ్యతతో కూడిన, ఆనందదాయకమైన చర్య అన్న అవగాహన పెరగాలి. అర్థవంతమైన సంబంధాల్లోనే అన్యోన్యత, ఆప్యాయతలుంటాయన్న విషయం తెలుసుకోవాలి. శృంగారాన్ని తేలికగా తీసుకునేవాళ్లు కూడా.. బంధాలను దాటి.. బయటి మార్గాలను తొక్కుతున్నప్పుడు సురక్షిత విధానాలను, బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించటం చాలా అవసరం.

వయసులేని వ్యవహారం

శృంగారానికి వయసేమీ ఉండదు. మనుషులు పూర్తి ముదుసలి వయసులో కూడా శృంగార భావనలను ఆస్వాదించొచ్చు. ఇది సహజం, సర్వసాధారణం కూడా. ఇందులో తప్పేమీ లేదు. పండువయసులో ఇదేమిటని సిగ్గుపడాల్సిన పని లేదు. నిజానికి ఆ వయసుకు వచ్చేసరికి ఆసక్తులు మారొచ్చు. ఒకప్పటిలా చురుకుదనం, స్తంభనలు ఉండకపోవచ్చు. శృంగారమంటే అంగాంగ సంభోగమే అని భావించటం పొరపాటు. భాగస్వామిని స్పృశించటం, హత్తుకోవటం, చివరికి చేతి మీద చేయి వేసి ప్రేమగా నిమరటం కూడా ఎంతో అనిర్వచనీయమైన శృంగార భావనను, తృప్తినీ ఇవ్వచ్చు. నూరేళ్ల వయసులోనూ తమ శృంగార జీవితం ఆనందభరితంగా ఉందని చెప్పేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం దీన్ని తప్పుగా భావిస్తూ, ఈ వయసులో మాకేమిటీ ఆలోచనలని వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సహజమని, ఆరోగ్యకరమైన అంశమేనని గుర్తించాలి. కాకపోతే వృద్ధాప్యంలో చాలామంది భాగస్వామి దూరమై, నిర్వేదంలోకి జారిపోతుంటారు. ఇలాంటి వారికి డిల్డూలు, వైబ్రేటర్ల వంటి 'సెక్స్‌ టాయ్స్‌' ఉపయోగపడతాయి. వీటిని చీదరించుకోవాల్సిన అవసరం లేదు. వీరి గురించి నైతికమైన తీర్పులు ఇవ్వటం, వారి మీద లేనిపోని ముద్రలు వేయటం తగదు. అది వారి వైయక్తిక నిర్ణయం. ఎవరైనా సామాజికమైన, చట్టబద్ధమైన కట్టబాట్లను అతిక్రమించనంత వరకూ వారి జీవితాల్లో ప్రవేశించటం, వారిని విమర్శించటం, జోక్యం చేసుకోవటం కూడా తగదు.

ఇది 'విద్య' కాదు!

'ప్రస్తుతం విద్యార్థులకు లైంగిక విద్య పేరుతో జరుగుతున్న బోధన ఎందుకూ కొరగాకుండా ఉంది. అసలు దీన్ని బోధిస్తున్న వారిలోనే చాలామందికి తగినంత శాస్త్రీయ దృక్పథం ఉండటం లేదు. వీరిలో సంకుచిత, సంప్రదాయ ధోరణులు గలవారే ఎక్కువ. ఆ పుస్తకాల్లో పిల్లలు ఎన్నడూ చూడని అండాశయాలు, వృషణాల వంటి స్త్రీపురుష జననాంగ అంతర్భాగాలవో, అండం, తోకతో తిరుగుతున్నట్టుండే శుక్ర కణం వంటి బొమ్మను చూపించి ఏదో తూతూమంత్రంగా చెప్పేశామని అనిపించటం వల్ల.. కుతూహలం ఎక్కువగా ఉండే వారి బుర్రల్లో గందరగోళం పెరుగుతోంది. లేదంటే సినిమాల్లోలా రెండు పువ్వులు దగ్గరకు రావటం, రెండు పక్షులు ముక్కులు పొడుచుకోవటం వంటివి చూపించటం వల్ల వారిలో శాస్త్రీయమైన దృక్పథం నెలకొనటం లేదు. ఆ బొమ్మలకూ, నిజజీవితంలో వాళ్లు చూసుకునే వాస్తవ శరీర భాగాలకూ మధ్య ఎక్కడా పొంతనే లేక పిల్లలు గందరగోళంలో పడిపోవటం... లేదంటే అసలు మొత్తానికే పట్టించుకోకపోవటం.. ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. ఈ మొత్తం ధోరణి.. శృంగారాన్ని మరింత నిస్సారమైన అంశంగా కూడా తయారు చేస్తోంది. లైంగిక విద్య అన్నది తమ మనసుల్లో రేగుతున్న శృంగార భావనలను, ఆ మార్పులను, వాంఛలను అర్థం చేసుకునే దిశగా సహాయపడాలి. శృంగారమన్నది బంధాలను బలపరుస్తుందని, అది ప్రేమాస్పదమైనదని, అది ఆనంద దాయకమైనదని, అలాగే అది ఎంతో బాధ్యతాయుతమైనదని కూడా తెలిసేలా ఉండాలి. శృంగార చర్యల పర్యవసానం, ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుని వాళ్లు బాధ్యతగా మెలిగేందుకూ దోహదం చెయ్యాలి.'

-సుధాకర్​ కృష్ణమూర్తి, సెక్సువల్​ మెడిసన్​ స్పెషలిస్ట్​

ఇదీ చూడండి: జీ-స్పాట్​ అంటే ఏంటి.. భావప్రాప్తిలో దాని పాత్రేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.