రాజ్యాంగంలోని అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ జీవితంపై డి.నటరాజ్ రాసిన 'స్వేచ్ఛా సమానత్వ మహాజ్వాల అంబేడ్కర్' పుస్తకాన్ని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన ఆవిష్కరించారు. రాజ్యాంగమే దేశ పరిపాలనకు దిక్సూచి అని వ్యాఖ్యానించారు. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలన్న అంబేడ్కర్ పిలుపును ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ గుర్తుచేశారు.
ఇదీ చదవండి