ETV Bharat / state

ఊరు దాటాలంటే... అశ్వమే ఆధారం! - గుర్రాలపై ఆధారపడుతున్న గిరిపుత్రులు

విశాఖ మన్యంలో గిరిపుత్రులు కొండలు, కోనలు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవటంతో అశ్వాలనే నమ్ముకుంటున్నారు. చిన్న పిల్లలు సైతం వీటి మీదే ప్రయాణం చేస్తున్నారు.

tribals in vishaka agency depends on horses for travel
ఊరు దాటాలంటే... అశ్వమే ఆధారం!
author img

By

Published : Dec 26, 2019, 4:52 AM IST

ఊరు దాటాలంటే... అశ్వమే ఆధారం!

విశాఖ మన్యంలోని చాలా గ్రామాల్లో నేటికీ సరైన రవాణా సదుపాయాలు లేవు. ఊరు దాటి వెళ్లాలంటే పాతకాలం నాటి ప్రయాణ సాధనాలనే వినియోగిస్తున్నారు అక్కడి గిరి పుత్రులు. విశాఖ మన్యంలోని అత్యంత మారుమూల కొండ గూడాల్లో.... అశ్వాలనే ప్రయాణ సాధనాలుగా వాడుతున్నారు. ముఖ్యంగా వారాంతపు సంతకు చేరుకోవాలంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ గుర్రాల సాయంతోనే కొండా, కోనలు దాటుతున్నారు.

సంతకు వెళ్లాలంటే తంట
వారు తెచ్చిన దినుసులను సంతల్లో అమ్మి ... నిత్యావసర సరుకులు కొని గోనె సంచుల్లో నింపుతారు. వాటిని గుర్రాలపై వేసి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు. కాలాలు మారినా వారి జీవితాలు మాత్రం అభివృద్ధిపరంగా వంద ఏళ్ల వెనకే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సెల్ సిగ్నల్స్ కూడా అందవు. ఇప్పటికీ ఈ ప్రాంతాలు బాహ్య ప్రపంచానికి దూరంగానే ఉంటున్నాయి.

మినీ బస్సులు ఏర్పాటు చేస్తాం
మన్యం ప్రజల సమస్యలను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. త్వరలోనే మినీ బస్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గంటల తరబడి గుర్రాలపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామాలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Intro:ap_vsp_76_24_gurrale_vahanaalu_kondallo_paderu_avb_vo_ap10082

యాంకర్: షికారు వెళ్లాలంటే రయ్ మని బండి స్టార్ట్ చేస్తాము... పెళ్లిళ్లు, కార్యాలకు వెళ్లాలంటే గౌరవాలు తగ్గట్టు కారు గేర్ మారుస్తాము... కానీ ఆ ప్రాంతంలో రాతి యుగం నాటి ప్రయాణ సాధనం వినియోగించి.. సంచరిస్తుంటారు.. కొండ కోనలు దాటి ధనిక బీద తేడా లేకుండా ముందుకు సాగుతుంటారు... ఆ వాహనాలు అందరికీ తెలిసిందే మరి ఎందుకు ఆలస్యం మీరే చూడండి....

వాయిస్1) వరుస గుర్రాలు చూస్తుంటే ఏదో యుద్దానికి వెళ్లినట్లు, ఏదో గుర్రాల పోటీలకు వెళ్లినట్లుంది కదూ... అదేమిటో తెలియాలంటే మన్యం శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే.....
విశాఖ మన్యం అత్యంత మారుమూల కొండ గూడాల్లో గుర్రాలనే ప్రయాణ సాధనాలు గా వాడతారు. రాజుల కాలం నాటి అశ్వాలే నేటికీ శరణ్యం.. గంటల తరబడి అటవీ కొండ కోనల నుంచి ప్రయాణించి వారపు సంతలకు చేరుకుంటారు. కొండ గ్రామాల గుండా పిల్లా పెద్దా అందరూ సంతలకు గుర్రాలపై పరుగు పెడతారు.....
బైట్: శ్రీను, దొంతురాయి
వాయిస్2) సంతల్లో వారు తెచ్చిన దినుసులు అమ్మి ... నిత్యావసర సరుకులు కొని గోనె సంచుల్లో నింపుతారు. వాటిని గుర్రాలపై వేసి ఇంటివైపు తిరుగు ప్రయాణం అవుతారు. కాలం మారినా వారి జీవితాలు వంద ఏళ్ల వెనక్కే ఉంటుంది.. ఆయా గ్రామాల్లో అసలు సెల్ సిగ్నల్స్ కూడా లేవంటే నమ్మండి.. వారు ఏలా బతుకుతున్నారో అనిపిస్తుంది. ఇప్పటికీ ఈ ప్రాంతాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాయి.
బైట్: సన్యాసి, దొంతురాయి
....
బైట్: కె భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు
.......
ముగింపు: గుర్రాలపై ప్రయాణం చూసే వారికి రాజా ఠీవీ కనిపించినా వారి జీవితాలు అంధకారంలోనే...
శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.