అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.. - అక్రమ రేషన్ పట్టివేత.. 50 బస్తాలు స్వాధీనం
గుంటూరు జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా త్రిపురంతాకంలో పోలీసులు పట్టుకున్నారు.

అక్రమ రేషన్ పట్టివేత.. 50 బస్తాలు స్వాధీనం
ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండల కేంద్రంలోని అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రిపురాంతకంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి యర్రగొండపాలేనికి బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి 'మమ్మల్ని సచివాలయాలకు కేటాయించడం సరికాదు'