Parking of YSRCP Leaders Vehicles At Guntur Mirchi Yard : గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ రాకతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. వాహనదారులు, సామాన్యులు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
మిర్చియార్డులోకి సరకు తెచ్చే మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే ఆగిపోయాయి. వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మిర్చి రైతులను కలిసిన జగన్ కూటమి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
'మిర్చీయార్డులో రైతులు పడే కష్టాలు చంద్రబాబునాయుడుకు అర్థం అవ్వడం లేదు. ఓ వైపు పంటకు తెగుళ్లతో సరైన దిగుబడి రావడం లేదు. మరోవైపు గిట్టుబాటు ధర అందించడంలేదు. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఈ రోజు ఇక్కడ పరిస్థితులు చూసినట్లైతే, ప్రతిపక్షనాయకుడు ఇక్కడకు వస్తుంటే చంద్రబాబునాయుడు పోలీసు భద్రత కూడా కల్పించలేదు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇలాగే భద్రత ఇవ్వకుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.' -జగన్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు
అధికారంలోకి వచ్చాక వారందరి సంగతి తేలుస్తాం : వైఎస్ జగన్
జగన్‌కు ప్రజాసమస్యలు పట్టవు - అందుకే అసెంబ్లీకి రావడం లేదు: జీవీ ఆంజనేయులు