ETV Bharat / state

ప్రభుత్వ స్థలంలో గుడిసెల తొలగింపు.. పరిస్థితి ఉద్రిక్తం - నైనవరంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెల తొలగింపు

పిన్​ నైనవరంలో ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Removal of huts in public places
'ప్రభుత్వ స్థలంలో గుడిసెల తొలగింపు'
author img

By

Published : Dec 28, 2019, 4:02 PM IST

ప్రభుత్వ స్థలంలో గుడిసెల తొలగింపు

విజయవాడ గ్రామీణ మండలం పిన్​ నైనవరంలో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న గుడిసెలను తొలగించేందుకు రెవిన్యూ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతానికి జేసీబీతో వచ్చి గుడిసెలు తొలగిస్తుండగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ తహసీల్దార్ వనజాక్షి పర్యవేక్షణలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గన్నవరం వైకాపా సమన్వయకర్త, కేడీసీసీ చైర్మన్​ యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకొని.. స్థానికులకు నచ్చజెప్పి.. అధికారులకు
ఒప్పించారు. 12 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమకు ప్రత్యామ్నాయం చూపించాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరారు. ఉగాది పర్వదినం రోజున ఇక్కడున్న పేదలందరికీ పక్కా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానని కేడీసీసీ చైర్మన్​ హామీ ఇవ్వటంతో అందరూ శాంతించారు.

ఇదీ చదవండి:

పేదలు గుడిసెలు తొలగించిన అధికారులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.