అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దేవరకొండ... ప్రభుత్వ స్థలంలోని పేదల గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించారు. 400 గుడిసెలను జేసీబీలతో కూల్చివేశారు. తాము చెప్పేది వినిపించుకోకుండా అకస్మాత్తుగా వచ్చి ధ్వంసం చేశారని... బాధితులు వాపోయారు. రోడ్డునపడ్డ కుటుంబాలు ధర్నాకి దిగగా... ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం వద్దకు బాధితులు చేరుకొని ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తాము చట్టపరంగానే గుడిసెలు తొలగించామని... అర్హులైన వారికి వేరే ప్రాంతంలో భూమి కేటాయిస్తామని తహసీల్దార్ మహబూబ్ బాషా తెలిపారు.
పేదలు గుడిసెలు తొలగించిన అధికారులు - అనంతపురం జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ స్థలం వార్తలు
అనంతపురం జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న 400 గుడిసెలను అధికారులు తొలగించారు. బాధితులు ధర్నాకు దిగగా... ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దేవరకొండ... ప్రభుత్వ స్థలంలోని పేదల గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించారు. 400 గుడిసెలను జేసీబీలతో కూల్చివేశారు. తాము చెప్పేది వినిపించుకోకుండా అకస్మాత్తుగా వచ్చి ధ్వంసం చేశారని... బాధితులు వాపోయారు. రోడ్డునపడ్డ కుటుంబాలు ధర్నాకి దిగగా... ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం వద్దకు బాధితులు చేరుకొని ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తాము చట్టపరంగానే గుడిసెలు తొలగించామని... అర్హులైన వారికి వేరే ప్రాంతంలో భూమి కేటాయిస్తామని తహసీల్దార్ మహబూబ్ బాషా తెలిపారు.
రోడ్డున పడ్డ 400కుటుంబాలు...
బుక్కరాయసముద్రం మండలం దేవరకొండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో సీపీఐ పార్టీ అద్వర్యంలో పేదలు వేసుకున్న 400 గుడిసెలను జెసిబి లతో రెవెన్యూ అదికారులు,పోలీసులు సహకారంతో తొలగించారు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించుకున్నాము అన్నా వినిపించుకోకుండా ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా వచ్చి ద్వంసం చేశారు. అని భాదితులు వాపోతున్నారు.దీంతో అక్కడ నివాసం ఉన్న 400 కుటుంబాలు రొడ్డున్న పడ్డాయి. భాదితులు తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు.
బైట్: ఎమ్మార్వో మహబూబ్ బాషా....
Body:శింగనమల
Conclusion:కాంట్రిబ్యుటర్: ఉమేష్