ETV Bharat / state

గోకవరంలో పోలీస్​ స్టేషన్​ ఎదుట స్థానికుల ఆందోళన

ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందిచలేదని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక నాయకుడు జనపరెడ్డి బాబు ఆధ్వర్యంలో పోలీస్​ స్టేషన్​ ఎదుట ధర్నా చేశారు.

author img

By

Published : Dec 21, 2019, 7:15 PM IST

protest of police action in Gokavaram
గోకవరంలో పోలీసుల తీరుకు నిరసనగా ధర్న
గోకవరంలో పోలీస్​ స్టేషన్​ ఎదుట స్థానికుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీసు స్టేషన్ ఎదుట స్థానికులు ధర్నాకు దిగారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత స్నానం చేస్తుండగా... అదే గ్రామానికి చెందిన యువకుడు సెల్ ఫోన్లో వీడియో తీశాడు. ఇది గమనించిన వివాహిత కుటుంబ సభ్యులు చరవాణి లాక్కోగా.. యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరిగా స్పందించడం లేదని వివాహిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక నాయకుడు జనపరెడ్డి బాబు ఆధ్వర్యంలో పొలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. నిందితుడు పోలీసు ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్​గా పనిచేశాడని.. వారి ఒత్తిళ్లతోనే అతన్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సీఐ పవన్ కుమార్ రెడ్డి న్యాయం జరిగేలా చూస్తానని నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి మద్దతు

Intro:పోలీసుల తీరుకు నిరసన గా ధర్నా. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీసు స్టేషన్ ఎదుట శనివారం పోలీసుల తీరుకు నిరసన గా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కొత్తపల్లి గ్రామానికి చిందిన వివాహిత (24)స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు సెల్ ఫోన్లో వీడియో తిసాడు. గమనించిన వివాహిత కుటుంబ సభ్యుల సహకారం తో సెల్ ఫోన్ లాక్కోగా యువకుడు పరారయ్యాడు. సెల్ ఫోన్ తీసుకువచ్చి గోకవరం పోలిస్ స్టేషన్లో శుక్రవారం యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు సరిగా స్పందిచక పోవడంతో స్థానిక నాయకుడు జనపరెడ్డి బాబు ఆధ్వర్యంలో పొలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిందితుడు పలువురు పోలీసు ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్ గా పనిచేసాడాని, వారి ఒత్తిళ్ళ తో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్కడకు చేరుకున్న సీఐ పవన్ కుమార్ రెడ్డి న్యాయం జరిగేటట్టు చూస్తానని వారికి నచ్చచెప్పడం తో ఆందోళన విరమించారు.

Body:యతీరాజులు, గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గ, తూర్పుగోదావరి జిల్లా

Conclusion:8008622066

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.