మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి మద్దతు మూడు రాజధానుల ప్రతిపాదనకు.. మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యమన్న ఆయన.. రాష్ట్ర సర్వతోముఖాభివృధికి సీఎం జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ ప్రతిపాదనను అంతా స్వాగతించాలని అన్నారు. జీఎన్‌రావు కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో అభివృద్ధి , పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందన్న చిరు.. ఇంకో లక్ష కోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలో ఉందన్నారు. నిరుద్యోగులకు మూడు రాజధానుల ప్రతిపాదన భరోసానిస్తుందని అన్నారు. ఇదే సమయంలో రాజధాని రైతుల్లో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలని, వాళ్లు నష్ట పోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదీ చదవండి:
'పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి'