ETV Bharat / sports

క్షమాపణలు చెప్పిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్ - క్షమాపణలు కోరిన జకోవిచ్​

ఆడ్రియా టోర్నీ నిర్వహణలో జరిగిన పొరపాటుకు తనను క్షమించాలని కోరాడు టెన్నిస్​ స్టార్​ నొవాక్​ జకోవిచ్​. ఇందులో పాల్గొన్న జకోవిచ్​తో సహా ముగ్గురు టెన్నిస్​ ఆటగాళ్లకు కరోనా సోకడమే ఇందుకు కారణం.

Novak Djokovic
జకోవిచ్​
author img

By

Published : Jun 24, 2020, 12:37 PM IST

ఆడ్రియా టోర్నీ నిర్వహించినందుకు తాను పశ్చాత్తాపం చెందుతున్నట్లు చెప్పాడు స్టార్​ టెన్నిస్ ప్లేయర్ నొవాక్​ జకోవిచ్​. బాల్కన్​ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పాల్గొన్న పలువురు క్రీడాకారులతో పాటు జకోవిచ్ కూడా కరోనా బారిన పడ్డారు. తనతో పాటు నిర్వహకులు దీనిని నిర్వహించడంలో విఫలమయ్యారని చెబుతూ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశాడు.

"మీ అందరికీ ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నేను, మా నిర్వహకులు స్వచ్ఛమైన మనసుతోనే ఈ ఎగ్జిబిషన్​ టోర్నీని నిర్వహించాం. అన్ని రకాల జాగ్రత్తలు పాటించాం. కానీ అనూహ్య రీతిలో మా వల్ల పొరపాటు జరిగిపోయింది. మీకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఈ టోర్నీకి హాజరైనవారంతా కొవిడ్​-19 నిర్ధరణ పరీక్షలు చేయించుకోండి. భౌతిక దూరం పాటించండి"

-జకోవిచ్​, సెర్బియా టెన్నిస్​ స్టార్​

కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలో ఆటగాళ్లను ఓచోటకు చేర్చి టోర్నీ జరిపిన తీరుపై.. జకోవిచ్​పై​ తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఎగ్జిబిషన్​ టోర్నీ​లో పాల్గొన్నవారెవరూ భౌతిక దూరాన్ని పాటించలేదని తెలుస్తోంది. ఇప్పటికే విక్టర్​, అతడి భార్య, ద్రిమితోవ్​, బోర్నా కోరిక్​, జకోవిచ్​, అతని భార్యకు కరోనా సోకింది. ఈ పరిస్థితుల కారణంగా జరగాల్సిన తర్వాతి మ్యాచులను రద్దు చేశారు.

ఇది చూడండి : టెన్నిస్​ స్టార్​ నొవాక్​ జకోవిచ్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.