ETV Bharat / sports

టోక్యో​ ప్రభావం పారిస్​ ఒలింపిక్స్​పై​ పడనుందా? - Paris Olympics

కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్​ వాయిదాపడ్డాయి. అయితే వీటి ప్రభావం రాబోయే పారిస్​ విశ్వక్రీడలపై ఉండదని నిర్వహకులు చెబుతున్నారు.

Paris 2024 Olympics
టోక్యో​ ప్రభావం పారిస్​ ఒలింపిక్స్​ పడనుందా?
author img

By

Published : Mar 25, 2020, 1:01 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన విశ్వక్రీడల్ని వచ్చే ఏడాది జరపనున్నారు. అయితే దీని ప్రభావం 2024లో జరిగే పారిస్​ ఒలింపిక్స్​పై ఏ మాత్రం ఉండదని ఒలింపిక్​ కమిటీ నిర్వహకులు టోనీ ఎస్టాంగ్యుయెట్​ అన్నారు. ఆ పోటీలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు.

'2024 వేసవిలో పారిస్​ ఒలింపిక్స్​ యథావిధిగా జరుగుతాయి. వాటిపై ఏం ప్రభావం లేదు. ప్రస్తుత ఒలింపిక్స్ తేదీ మార్చడం అథ్లెట్లకు మంచిదే'

- టోనీ ఎస్టాంగ్యుయెట్​, ఒలింపిక్స్​ నిర్వహకులు

ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన ఒలింపిక్స్​ను వాయిదా వేస్తున్నట్లు ఐఓసీ, జపాన్​ ప్రధాని షింజో అబె సంయుక్తంగా ప్రకటించారు. ఈ విశ్వక్రీడల్ని వచ్చే ఏడాది నిర్వహిస్తామని చెప్పారు. అయితే వైరస్​ వ్యాప్తితో ఈ ఏడాది యూరప్​లో జరగాల్సిన ఫుట్​బాల్​ లీగ్​ వచ్చే ఏడాదికే వాయిదా పడింది.

ఇదీ చదవండి: ఒలింపిక్స్ వాయిదా ఇదే తొలిసారా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.