ETV Bharat / sports

మరోసారి పసిడి పట్టేసిన నీరజ్ చోప్రా - neeraj chopra gold medal

Neeraj Chopra gold in kourtane
Neeraj Chopra gold in kourtane
author img

By

Published : Jun 18, 2022, 10:44 PM IST

Updated : Jun 18, 2022, 10:56 PM IST

22:36 June 18

మరోసారి పసిడి పట్టేసిన నీరజ్ చోప్రా

భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచవేదికపై మెరిశాడు. ఫిన్లాండ్​లో జరుగుతున్న కోర్తానే గేమ్స్​లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్, గ్రెనెడా దేశస్థుడు అండర్సన్ పీటర్స్​ను వెనక్కినెట్టి ఈ పతకం సాధించడం విశేషం.

తొలి ప్రయత్నంలో రికార్డు దూరం విసిరిన నీరజ్.. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. అప్పటికే పతకం ఖాయమైన నేపథ్యంలో మిగిలిన మూడు ప్రయత్నాలు చేయకుండానే విరమించుకున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా బల్లెం విసరడం ఆటగాళ్లకు కష్టమైంది. ఈ క్రమంలోనే మూడో ప్రయత్నంలో నీరజ్ పట్టు కోల్పోయి జారాడు. ట్రినిడాడ్​కు చెందిన వాల్కట్ కెషోర్న్ బల్లెంను 86.64 మీటర్లు విసిరి రెండోస్థానంలో నిలవగా.. 84.75 మీటర్లు విసిరిన అండర్సన్ పీటర్స్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు.

Last Updated : Jun 18, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.