ETV Bharat / sports

ఫుట్​బాల్​ మాంత్రికుడు మెస్సీనే మ్యాజిక్​తో మాయ చేశాడుగా! - లియోనల్​ మెస్సీ ఫుట్​బాల్​

లెజండరీ ఫుట్​బాల్​ ప్లేయర్​ లియోనల్​ మెస్సీ అంటే తెలియని వారు ఉండరు. తన ఆటతో ఫ్యాన్స్​కు మెస్మరైజ్​ చేసే ఈ స్టార్​​ ప్లేయర్​ను​ ఓ వ్యక్తి బోల్తా కొట్టించాడు. ఆ వివరాలు..

messi
messi
author img

By

Published : Feb 3, 2023, 12:51 PM IST

ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీకి ప్రపంచమంతటా ఫ్యాన్స్​ ఉన్నారు. అతని ఆట తీరును అభిమనించే వారు అతని స్టైల్​కు కూడా ఫిదా అవుతుంటారు. అయితే మైదానంలో తన ఆటతో అభిమానులను మాయ చేయగల సత్తా ఉన్న మెస్సీనే తన మ్యాజిక్​తో బోల్తా కొట్టించాడు ఓ మెజీషియన్‌. ఇంతకీ ఏం జరిగంటే..

ఫిఫా ప్రపంచ కప్​లో విజయాన్ని సాధించిన తర్వాత ప్యారిస్‌ సెయింట్‌ జెర్మన్‌(పీఎస్​ జీ) అనే క్లబ్‌కు మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి పీఎస్‌జీ ప్లేయర్స్‌ కోసం ప్యారిస్‌లో ఓ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెస్సీతో పాటు ఇతర పీఎస్‌జీ ప్లేయర్లు హాజరయ్యారు. కాగా ఇదే పార్టీకి జూలిస్‌ డెయిన్‌ అనే మెజీషియన్‌ కూడా వచ్చాడు. ఆయన మెస్సీ దగ్గరికి వచ్చి ఓ కార్డ్‌ ట్రిక్‌ ప్లే మ్యాజిక్‌ షో చూపిస్తానన్నాడు. దానికి మెస్సీ సరేనన్నాడు.

అయితే మెస్సీని ఒక కార్డు సెలెక్ట్‌ చేసుకోవాలని.. కానీ అది ఏ కార్డు అనేది తనకు చూపించొద్దన్నాడు. అలా మెస్సీ ఏస్‌(A) కార్డును సెలెక్ట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత తన మ్యాజిక్‌ ట్రిక్‌తో మెస్సీ ఎంచుకున్న కార్డును మెజీషియన్‌ కరెక్టుగా చూపించడంతో పాటు అర్థం కాని భాషలో మాట్లాడాడు. ఆ సమయంలో మెస్సీ భార్య ఆంటోనెల్లా కూడా అక్కడే ఉంది. ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో తెలియక మెజీషియన్‌ పడుతున్న కష్టాన్ని చూసి మెస్సీ నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది. ఇది చూసిన మెస్సీ ఫ్యాన్స్​ మెస్సీ అమాయకత్వాన్ని చూసి మురిసిపోయారు.

ఇక కెరీర్​ విషయానికి వస్తే.. మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ అందించిన తర్వాత ఆటకు రిటైర్మెంట్‌ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరికొన్ని రోజులు తన ఆటను కొనసాగిస్తానని మెస్సీ తన మనసులోని మాటను చెప్పాడు. అయితే గత రెండు రోజులుగా ఆయన త్వరలోనే రిటైర్మెంట్​ ప్రకటించనున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మెస్సీ కూడా అర్జెంటీనా జెర్సీని పట్టుకొని.. 'ఇక ముగిసింది' అన్నట్లుగా హింట్‌ ఇవ్వడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.