ETV Bharat / sports

'టిక్​టాక్​ లేనందున ఇంటర్నెట్​ ప్రశాంతంగా ఉంది' - హీనా సిద్ధు టిక్​టాక్​

టిక్​టాక్​ నిషేధం గురించి మాట్లాడిన షూటర్ హీనా సిద్ధూ.. ఇప్పుడు ఇంటర్నెట్​ ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చింది. అసభ్యకర వీడియోలకు చెక్ పెట్టినట్లయిందని ట్వీట్ చేసింది.

Internet Will Be a Happier Place Without TikTok: Heena Sidhu
'టిక్​టాక్​ లేకుండా ఇంటర్నేట్​ ప్రశాంతంగా ఉంది'
author img

By

Published : Jul 1, 2020, 11:41 AM IST

చైనాకు సంబంధించిన 59 మొబైల్ యాప్స్​పై నిషేధం విధించిన కేంద్రం నిర్ణయంపై, భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా టిక్​టాక్​ను బ్యాన్​ చేయడంపై తెగ ఆనందపడిపోయింది. దీని వల్ల అంతర్జాలంలో అవాంఛనీయ వీడియోలకు చెక్​ పెట్టినట్లయిందని ట్విట్టర్​లో రాసుకొచ్చింది.

  • It's not gone yet but I hope the govt follows through. The responsibility lies with the developers for allowing such content to become not just visible but viral. Unless they change their norms for content uploading this app shouldn't have a place in our lives

    — Heena SIDHU (@HeenaSidhu10) June 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టిక్​టాక్​ను తొలగించడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ యాప్​లో జంతువులను హింసించే వీడియోలతో పాటు అసభ్యకరమైనవి విపరీతంగా వచ్చేవి. అలాంటి వాటిని నియంత్రించే బాధ్యత టిక్​టాక్​ యాజమాన్యంపై ఉంది. ఆ సంస్థ అప్​లోడ్​ కంటెంట్​ సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయకపోతే, మన జీవితంలో దానికి (యాప్​) చోటు ఉండకూడదు. టిక్​టాక్​ లేకుండా ఇంటర్నెట్​ ప్రశాంతంగా ఉంది"

- హీనా సిద్ధు, భారత షూటర్​

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంది. టిక్​టాక్​, షేర్​ ఇట్​ సహా మరో 57 చైనా యాప్స్​ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వీటిని దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. ఈ యాప్​లు సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు భారత్‌ ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరే, ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కేంద్రం ఇలా చేసింది.

ఇదీ చూడండి... రోహిత్​ ప్రదర్శనపై పూర్తి నమ్మకముంది: హస్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.